బాస్కెట్‌బాల్‌ విజేత భీమవరం | Sakshi
Sakshi News home page

బాస్కెట్‌బాల్‌ విజేత భీమవరం

Published Mon, Aug 29 2016 10:32 PM

బాస్కెట్‌బాల్‌ విజేత భీమవరం

మార్టేరు(పెనుమంట్ర) :  రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్‌ పోటీల విజేతగా భీమవరం బాలుర జట్టు చాంపియ¯Œæగా నిలిచింది. బాలికల విభాగం విజేతగా మార్టేరు జట్టు జయకేతనం ఎగురవేసింది. స్థానిక వేణుగోపాల స్వా మి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో మూడు రోజుల పాటు స్వ ర్గీయ పడాల ప్రహ్లాదరెడ్డి మెమోరియల్‌ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలు సోమవారం రాత్రితో ముగిశాయి. బాలికల విభాగంలో ఏలూరు జట్టుపై మార్టేరు జట్టు విజయం సాధించి ట్రోపీని కైవసం చేసుకుంది. బాలుర విభాగంలో మార్టేరు జట్టుపై హోరాహోరీ సాగిన పోరులో భీమవరం జట్టు 4 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. విజేతలకు ట్రోపీలను అందజేశారు. 
క్రీడలకు పుట్టిల్లు మార్టేరు
అంతర్జాతీయ క్రీడాకారులను అందిస్తున్న మార్టేరు గ్రామం క్రీడలకు పుట్టిల్లు అని జెడ్పీటీసీ సభ్యుడు సత్తి ఆదినారాయణరెడ్డి అన్నారు. రాత్రి నిర్వహించిన బహుమతి ప్రదానోత్సవంలో ఆయన మాట్లాడారు. అంతర్జాతీయ బాస్కెట్‌బాల్‌ క్రీడాకారుడు సత్తి సుబ్బన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతిభను ప్రోత్సహిస్తున్న క్రీడాభిమానుల సహకారం మరువలేనిదన్నారు. సత్తి గీతను స్ఫూర్తిగా తీసుకుని స్థా«నిక క్రీడాకారులు ముందుకు సాగాలన్నారు. తాడి శ్రీనివాసరెడ్డి, మేడపాటి సోమేశ్వరరెడ్డి, చింతా రామకృష్ణ, బి. రమేష్‌రెడ్డి, బి.వి.రత్తయ్యలు మాట్లాడారు. సభకు వైబీఏ గొలుగూరి శ్రీనివాసరెడ్డి అధ్యక్షత వహించారు. టోర్నమెంట్‌ ముగింపు సందర్భంగా స్వర్గీయ పడాల ప్రహ్లాదరెడ్డి విగ్రహానికి వైద్యురాలు ఆమె కుమార్తె, అతిథులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మార్టేరు– రామచంద్రపురం 40–ప్లస్‌ జట్ట మధ్య మ్యాచ్‌ నిర్వహించారు. ఆర్గనైజింగ్‌ కమిటీ సభ్యులు జి. లక్ష్మణరెడ్డి, జి.సత్యనారాయణరెడ్డి, కె.వినాయకరెడ్డి, ఎ.భాస్కరరెడ్డి, కె.మురళీకృష్ణ, కె.కృష్ణారెడ్డి, పి.శ్రీనివాసరెడ్డి, వి. నగేష్‌రెడ్డి, బి.విజయకుమార్‌ పాల్గొన్నారు. 
 

Advertisement
Advertisement