బీసీ సంక్షేమంలో కేటాయింపులు పూర్తి | Sakshi
Sakshi News home page

బీసీ సంక్షేమంలో కేటాయింపులు పూర్తి

Published Thu, Aug 25 2016 12:31 AM

BC welfare provisions in the full

  • కొత్త జిల్లాల వారీగా ఉద్యోగుల తాత్కాలిక పంపకం
  • సిద్ధమైన ప్రాథమిక ప్రతిపాదనలు
  • ఉద్యోగుల నుంచి ఆప్షన్ల స్వీకరణ
  • హన్మకొండ అర్బన్‌ : కొత్త జిల్లాల ఏర్పాటు, ఉద్యోగు ల కేటాయింపు విషయంలో జిల్లాలో మిగతా శాఖల క న్నా బీసీ సంక్షేమశాఖ అధికారులు ఒకడుగు ముందున్నారు. వరంగల్‌ జిల్లాలోని ప్రాంతాలకు పక్క జిల్లాల నుంచి కొన్ని ప్రాంతాలు కలుపుకుని నాలుగు జిల్లాలు గా ఏర్పాటుచేయనున్నట్లు ప్రభుత్వం ముసాయిదా వి డుదల చేసింది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖలో ఉన్న అధికారులు, ఉద్యోగులను వారి స్థానికత, సీనియారి టీ ఆధారంగా ప్రాథమికంగా తాత్కాలిక కేటాయింపు లు పూర్తి చేశారు. శాఖలో ఉన్న డీడీ, డీబీసీడబ్ల్యూవో, ఏబీసీడబ్ల్యూవోల్లో ఎవరెవరు ఏ జిల్లాకు వెళ్తారనే విషయంలో స్పష్టతకు వచ్చేశారు. ఇదే విషయమై ఇటీవల హైదరాబాద్‌లోని శాఖ కమిషనర్‌ కార్యాలయంలో జరిగిన సమావేశంలో నివేదికకు జిల్లా అధికారులు అందజేశారు. కాగా, జిల్లా స్థాయి అధికారులను తా త్కాలికంగా సీనియార్టీని బట్టి కేటాయించినా మిగతా అధికారులు, కింది స్థాయి ఉద్యోగులను వారి స్థానిక మండలం ఆధారంగా జిల్లాలకు కేటాయించారు. ఆ తర్వాత శాశ్వత కేటాయింపుల కోసం ప్రతి ఉద్యోగి నుంచి ఆప్షన్‌ ఫాం తీసుకున్నారు.
    కొత్త జిల్లాలకు సీనియర్‌ అధికారులు
    కొత్తగా ఏర్పడబోయే జిల్లాలకు కొత్త అధికారులను ఇ వ్వడం కానీ, పాత ఉద్యోగులకు పదోన్నతులు కల్పిం చడం కానీ ఉండవని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చే సింది. ఈ నేపథ్యంలో జిల్లాలో ఉన్న అధికారుల్లోనే సీనియారిటీ ప్రాతిపదికన ఏ జిల్లాకు ఎవరు వెళ్తారనే విషయంలో స్పష్టత వచ్చేసింది. ప్రాథమిక సమాచా రం ప్రకారం వరంగల్‌తో పాటు హన్మకొండ, భూపాలపల్లి, మహబూబాబాద్‌ జిల్లాలు ఏర్పాటుకానుం డగా ప్రస్తుతం డీబీసీగా ఉన్న హృషికేష్‌రెడ్డి వరంగల్‌లో కొనసాగనున్నారు. ఆ తర్వాత స్థానాల్లో సీని యార్టీ ప్రకారం ములుగు ఏబీసీడబ్ల్యూఓ శైలజకు హన్మకొండ జిల్లా ఇన్‌చార్జ్‌ బాధ్యతలు, వరంగల్‌ ఏబీసీడబ్ల్యూఓకు భూపాలపల్లి ఇన్‌చార్జ్‌ బాధ్యతలు, డిప్యూటేషన్‌పై హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఝాన్సీకి మహబూబాబాద్‌ జిల్లా బాధ్యతలు అప్పగించే అవకా శం ఉంది. అయితే, గత డిసెంబర్‌ 15వ తేదీ నుంచి సెలవులో ఉన్న డీడీ రమాదేవి విధుల్లో చేరేందుకు రిపోర్ట్‌ చేశారు. ఆమెను ఉన్నతాధికారులు జిల్లాకు కేటాయిస్తే రమాదేవి వరంగల్‌ బీసీ సంక్షేమ అధికారిగా ఉంటారు. మిగతా వారు వరుసగా మారుతారు. సీనియార్టీ జాబితాలో చివరలో ఉన్న ఝాన్సీ ఏబీసీడబ్ల్యూఓగా కొనసాగాల్సి ఉంటుంది. అయితే ఇవన్నీ ప్రాథమిక  కేటాయింపులు మాత్రమేనని.. విభజన ప్రక్రియ పూర్తయిన తర్వాత జిల్లా అధికారులు వారి స్వస్థలాల ఆధారంగా జిల్లాలో ఉంటారా, వేరే జిల్లాలకు బదిలీ అవుతారా అన్నది తేలనుంది. ప్రస్తుతం మాత్రం ‘ఆర్డర్‌ టూ సర్వ్‌’ పద్ధతిలో కొనసాగుతారు.
    తేలాల్సిన వార్డెన్ల లెక్క..
    బీసీ సంక్షేమశాఖ పరిధిలో జిల్లాలో మొత్తం 49 ప్రీ మె ట్రిక్, 24 పోస్ట్‌ మెట్రిక్‌ హాస్టళ్లు ఉన్నాయి. వివిద కారణాలతో ఇందులోని ఆరు ప్రీ మెట్రిక్, మూడు పోస్టు మెట్రిక్‌ హాసళ్లను రెండు సంవత్సరాల్లో  మూసివేశా రు. అక్కడి వార్డెన్లను ఇతర చోట్లకు కేటాయించా రు. అయితే, జిల్లాల విభజనలో ఆయా మండలాలు ఇతర జిల్లాల పరిధిలోకి వెళ్లనుండడంతో వార్డెన్లకు ఎక్కడకు కేటాయిస్తారనే అంశంలో స్పష్టత రావాల్సి ఉంది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement