కొత్తపల్లి జలపాతాలకు పర్యాటకశోభ | Sakshi
Sakshi News home page

కొత్తపల్లి జలపాతాలకు పర్యాటకశోభ

Published Sun, Aug 7 2016 5:44 PM

కొత్తపల్లి జలపాతాలకు పర్యాటకశోభ

జి.మాడుగుల: విశాఖ ఏజెన్సీ జి.మాడుగుల మండలం కొత్తపల్లి జలపాతాలు పర్యాటక శోభ సంతరించుకుంటుంది. గిరిజన ప్రాంతాల్లో పలు సుందర జలపాతాల్లో కొత్తపల్లి జలపాతానికి మంచి గుర్తింపు ఉంది. ఇక్కడ చల్లటి, చక్కటి ఆహ్లదకరమైన వాతావరణంలో జలపాతాలు ఉండటంతో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుండే కాక ఇతర దేశాల నుండి కూడా పర్యాటకులు ఇక్కడకు వచ్చి అందాలను తిలకిస్తున్నారు. గతంలో విశాఖ జిల్లా పర్యటనకు వచ్చిన అమెరికా బృందం కొత్తపల్లి జలపాతాలు అందాలను వీక్షించిన సంఘటనలు ఉన్నాయి. రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర, జిల్లా, ఐటీడిఏ ఉన్నతాధికార్లు సైతం సందర్శించారు. కొత్తపల్లి  గ్రామం సమీపంలో అనేక చోట్ల ఉన్న పెద్దపెద్ద బండరాళ్లు పై నుండి జలవారుతున్న నీటి అందాల కనుల విందు చేస్తున్నాయి. జలపాతాల వద్ద సందర్శకులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కాఫీహౌస్, దుకాణాలు, గెడ్డపై  రెండు చోట్ల ఇసుప బ్రిడ్జిలు, కొండవాలు ప్రాంతం నుంచి కిందకు దిగటానికి రక్షణ ఇనుప గొట్టాలు అమర్చి నిర్మించిన మెట్లు, అక్కడడక్కడ కూర్చోవటానికి సిమ్మెంట్‌ దిమ్మలు వనబంధు కళ్యాణయోజన పథకం కింద నిధులు వె చ్చించి నిర్మంచారు. ప్రధానం ద్వారం వద్ద ఏసుప్రభువు విగ్రహం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. కొత్తపల్లి జలపాతాలను ప్రకతి అందాలకు తగ్గట్టుగా సుందరంగా తీర్చిదిద్దుతున్నారు.

Advertisement
Advertisement