బీరు ప్రియులకు పండగొచ్చింది | Sakshi
Sakshi News home page

బీరు ప్రియులకు పండగొచ్చింది

Published Sun, Oct 9 2016 4:31 PM

బీరు ప్రియులకు పండగొచ్చింది - Sakshi

హైదరాబాద్లో బీరు ప్రియులకు పండగొచ్చింది. సిటీలోని పబ్స్, రెస్టారెంట్స్‌ ‘అక్టోబర్‌ ఫెస్ట్‌’ పేరిట బీర్‌ ఫెస్టివల్స్‌తో సందడి చేస్తున్నాయి. బీరుకు కాంబినేషన్‌గా నప్పే వంటకాలతో పాటు ప్రత్యేకమైన థీమ్‌ ఈవెంట్స్‌ని నిర్వహిస్తున్నాయి.   – సాక్షి, వీకెండ్‌ ప్రతినిధి

జర్మనీలోని రాయల్‌ వెడ్డింగ్‌ను సాధారణ ప్రజలు సెలబ్రేట్‌ చేసుకోవడం దగ్గర్నుంచి ఆ ఈవెంట్‌ మరిన్ని ఆకర్షణలు అద్దుకుంటూ ప్రపంచమంతా విస్తరించింది. ప్రస్తుతం ప్రపంచపు అతిపెద్ద వోక్స్‌ఫెస్ట్‌గా జర్మనీలోని మ్యునిచ్, బవేరియా నగరంలో దీన్ని నిర్వహిస్తారు. సెప్టెంబర్‌ మధ్యలో ప్రారంభమై అక్టోబర్‌ తొలి వారం వరకు 16 రోజుల పాటు సాగే ఈ ఫెస్టివల్‌ బవేరియన్‌ కల్చర్‌లో అత్యంత ప్రధాన భాగం. దాదాపు 60 లక్షల మంది ఈ ఈవెంట్‌కు హాజరవుతారని అంచనా.

సిటీకి చీర్స్‌...
నగరంలోనూ బీరు ప్రియుల సంఖ్య ఎక్కువేనని తెలిసిందే. పైగా ఇటీవలే నగరంలో మైక్రోబ్రూవరీస్‌ సైతం ప్రారంభమయ్యాయి. అక్కడికక్కడే బీరు తయారు చేసి ఇచ్చే ఈ తరహా బ్రూవరీలు ఉన్న పబ్స్, రెస్టారెంట్స్‌ ఈ అక్టోబర్‌ ఫెస్ట్‌కు మరింత సందడి చేయనున్నాయి. స్పెషల్‌ ఆఫర్లు గుప్పిస్తున్నాయి. కింగ్‌ ఫిషర్‌ ఫ్యాషన్‌ షో సహా... దాదాపు ఈ నెలంతా ఈ ఫెస్ట్‌కు అనుబంధ కార్యక్రమాలు కొనసాగుతాయి. మ్యూజిక్‌తో అనుసంధానం చేస్తూ లైట్‌ డ్రింకింగ్‌ను ఆస్వాదించే నగర యువత ఈ టైమ్‌లో అందివచ్చే ఆఫర్ల కోసం ఏడాది మొత్తం వేచి చూస్తుందంటే అతిశయోక్తి కాదు.

 బీర్‌ ప్రియులకు రైట్‌ టైమ్‌
ఈ నెలలో విభిన్న రకాల బ్రాండెడ్‌ బీర్లు సర్వ్‌ చేస్తాం. అదే క్రమంలో ఈవెంట్స్‌ కూడా ఈ సందడికి హైప్‌ తెస్తాయి. మా అవుట్‌ స్వింగర్‌ పబ్‌లో ఈ నెల 14న ముంబై డీజే షెరిల్‌ ఆల్‌ నైట్‌ పార్టీ, 15న ప్రాజెక్ట్‌ తాండవ్‌ పేరుతో కోల్‌కతా డీజేలు టిష్యా, నవనీత్‌లు, 16న అవుట్స్‌ దట్‌ పేరుతో ఇండియా న్యూజిలాండ్‌ వన్‌డే మ్యాచ్‌ లైవ్‌లను ఈ ఫెస్ట్‌లో భాగంగా ప్రత్యేక మెనూతో అందిస్తున్నాం.   
                   – అఖిలేష్, అవుట్‌ స్వింగర్‌ పబ్‌

Advertisement
Advertisement