మన గురుకులాలే ఆదర్శం | Sakshi
Sakshi News home page

మన గురుకులాలే ఆదర్శం

Published Sun, Jul 24 2016 11:11 PM

మంత్రి హరీశ్‌రావుకు స్వాగతం పలుకుతున్న విద్యార్థులు

  • రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు
  • గురుకులంలో డార్మెటరీ హాల్‌ ప్రారంభం
  • సిద్దిపేట రూరల్‌: మన గురుకులాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి మిట్టపల్లి, ఎల్లుపల్లి గురుకులాలు ఆదర్శమని కొనియాడారు.  ఆది వారం మండలంలోని మిట్టపల్లి, ఎల్లుపల్లి శివారులోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఆవరణలో డార్మెటరీ హాల్, తల్లిదండ్రులకు విశ్రాంతి భవనం, డిజిటల్‌ ల్యాబ్, క్లాస్‌ రూంలను ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డితో కలిసి  ప్రా రంభించారు.

    ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ...  మిట్టపల్లి, ఎల్లుపల్లి గురుకులాల్లో డార్మిటరీ హాల్‌ ను రూ.5.50కోట్లతో కార్పొరేట్‌కు దీటుగా నిర్మించినట్టు చెప్పారు. పాఠశాలలో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న ప్రిన్సిపాల్, అధ్యాపక బృందాన్ని అభినందించారు. అంతకుముందు మంత్రి హరీశ్‌రావుకు విద్యార్థినులు ఘన స్వాగతం పలికారు.   పలు సాంస్కృతిక కార్యక్రమాలు, పలు విన్యాసాలతో అలరించారు. కార్యక్రమంలో ఎంపీపీలు ఎర్ర యాదయ్య, మాణిక్యరెడ్డి, ఎంపీపీ ఉపాధ్యక్షులు కోటగిరి శ్రీహరిగౌడ్, సర్పంచ్‌లు సిద్దరబోయిన రాజ్యలక్ష్మి శ్రీనివాస్, బాలకృష్ణారెడ్డి, పాఠశాల ప్రిన్సిపల్‌ ప్రశాంతీ, నాయకులు మిట్టపల్లి శ్రీనివాస్, రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.
    పుల్లూర్‌ బండపై మొక్కలు నాటిన మంత్రి  
    మండలంలోని పుల్లూర్‌ బండ శ్రీ  నరసింహస్వామి ఆలయ ఆవరణలో ఆదివారం రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డిలు మొక్కలు నాటారు. ‘జనం కోసం వనం... వనం కోసం మనం’  నివాదంతో ఆలయ ఆవరణలో మొక్కలు నాటారు. అంతకుముందు పుల్లూర్‌ బండపై మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీపీ యాదయ్య, సర్పంచ్‌ సరోజన ఆంజనేయులుగౌడ్, ఎంపీటీసీ మహేశ్, ఆలయ అర్చకులు రంగాచారి, శ్రీనివాసాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
    ఎక్సైజ్‌ ఆధ్వర్యంలో...
    సిద్దిపేట ఎక్సైజ్‌ పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం పుల్లూర్‌ గ్రామ శివారులో ఈత మొక్కలను మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డిలు నాటారు. ఈ సందర్భంగా గ్రామ గీత కార్మికులతో మంత్రి మాట్లాడారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సరోజన ఆంజనేయులుగౌడ్, ఎంపీటీసీ మహేశ్, ఎక్సైజ్‌ సీఐ రమేష్‌రెడ్డి, గీత కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
    మొక్కలతోనే మనుగడ  
    చిన్నకోడూరు: మొక్కలతోనే మానవ మనుగడ ఆధారపడి ఉందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌ మాట్లాడుతూ.. భావితరాలకు ఫలవంతమైన మనుగడను వనాల అభివృద్ధి ద్వారా సాధించ వచ్చన్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలో అటవీ విస్తీర్ణం 33 శాతం ఉండగా, మన జిల్లాలో 6 శాతం మాత్రమే ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫలితంగా జిల్లాలో ఆశించిన వర్షాలు కురవడం లేదన్నారు.  అతివృష్టి, అనావృష్టిని, భూమికోతను కాపాడేది చెట్లేనన్నారు. పర్యావరణ సమతుల్యతకు, భవిష్యత్తు తరాలకు మంచి వాతావరణం ఇచ్చేందుకు మొక్కలు పెంచాల్సిందేనన్నారు. వరుస కరువు వల్ల వ్యవసాయం మూలన పడిందన్నారు. అందుకు ప్రతి ఒక్కరు చెట్లు పెంచితే భవిష్యత్తు ఉంటుందన్నారు.

    అందుకు ప్రభుత్వం చేపట్టిన హరితహారంలో భాగస్వాములు కావాలన్నారు. మరుగుదొడ్ల నిర్మాణంలో వంద శాతం పూర్తి చేసి సిద్దిపేట నియోజకవర్గం ఆదర్శంగా నిలిచిందన్నారు. అదే స్ఫూర్తితో మొక్కలు నాటాలన్నారు. అన్ని కుల సంఘాలకు కమ్యూనిటీ భవనాలు నిర్మిస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి, ఎంపీపీ కూర మాణిక్యరెడ్డి, జెడ్పీటీసీ నమూండ్ల కమల రామచంద్రం,  ఓఎస్‌డీ బాల్‌రాజు, వెటర్నరీ ఏడీ అంజయ్య, తహసీల్దార్‌ శ్రీనివాస్‌రావు, ఎంపీడీఓ జాఫర్‌, సర్పంచ్‌లు మేడికాయల వెంకటేశం, మెట్ల శంకర్, ఎంపీటీసీలు బాలదుర్గవ్వ, ఆంజనేయులు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement