విద్యార్థులకు సైకిళ్లు | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు సైకిళ్లు

Published Wed, Aug 10 2016 12:15 AM

విద్యార్థులకు సైకిళ్లు

  • lట్రాన్స్‌పోర్ట్‌ చార్జీలకు బదులు సైకిళ్లు ఇవ్వాలని నిర్ణయం 
  • lప్రభుత్వ పాఠశాలల్లో 1061 మంది బాలురు.. 985 మంది బాలికల ఎంపిక
  • విద్యారణ్యపురి : జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు మూడు కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం వెళ్లే విద్యార్థులకు సైకిళ్లు ఇవ్వాలని నిర్ణయించారు. అంతదూరం నడవడం కష్టం కావడంతో విద్యార్థులు ఆటోల్లో వెళ్లేవారు. అయితే పేద పిల్లలకు రవాణా చార్జీలు భారం కాకుండా గత కొన్ని సంవత్సరాలుగా సర్వశిక్షాభియాన్‌ రాష్ట్ర ప్రాజెక్టు ద్వారా ఎంపిక చేసిన వారికి ఒక్కొక్కరికి రూ.3 వేల చొప్పున అందజేస్తున్నారు.
     
    జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు 2,049, యూపీఎస్‌లు 360, ఉన్నత పాఠశాలలు 510 ఉన్నాయి. యూపీఎస్, హైస్కూళ్లలో 6,7,8 తరగతుల విద్యార్థులకు 2015–16 విద్యా సంవత్సరానికి ట్రాన్స్‌పోర్ట్‌ చార్జీల కింద ఒక్కో విద్యార్థికి రూ.3 వేల చొప్పున రూ. 61.38 లక్షలు మంజూరయ్యాయి. ఈ మెుత్తాన్ని పంపిణీ చేసేందుకు మూడు కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించే 1061 మంది బాలురు, 985 మంది బాలికలను ఎంపిక చేశారు. అయితే విద్యార్థులకు ట్రాన్స్‌పోర్ట్‌ చార్జీలు చెల్లించే బదులు సైకిళ్లు ఇవ్వాలని కలెక్టర్‌ వాకాటి కరుణ ఇటీవలే నిర్ణయించారు.
     
    ఒక్కో సైకిల్‌ రూ. 3 వేల కంటే ఎక్కువే అవుతున్నందున అదనపు ఖర్చులు సుమారు రూ.13 లక్షలు తన నిధుల నుంచి ఇచ్చేందుకు కలెక్టర్‌ సుముఖత వ్యక్తం చేశారని సమాచారం. టెండర్లు పిలిచి సైకిళ్లను కొనుగోలు చేయడంతో పాటు సగానికి పైగా ఆయా మండలాల ఎమ్మార్సీ కార్యాలయాలకు కూడా పంపించారు. కొద్దిరోజుల్లోనే పూర్తిస్థాయిలో చేరుకోబోతున్నాయి. గత విద్యాసంవత్సరానికి సంబంధించిన 6,7,8 తరగతుల విద్యార్థులకు ఈ సైకిళ్లు అందించనున్నారు. కాగా 2016–17 సంవత్సర ట్రాన్స్‌పోర్ట్‌ నిధులు ఇంకా మంజూరు కాలేదు.  

Advertisement
Advertisement