పెద్దనోట్ల రద్దు అనాలోచిత చర్య | Sakshi
Sakshi News home page

పెద్దనోట్ల రద్దు అనాలోచిత చర్య

Published Sat, Jan 7 2017 11:10 PM

పెద్దనోట్ల రద్దు అనాలోచిత చర్య - Sakshi

– కలెక్టరేట్‌ ఎదుట కాంగ్రెస్‌ పార్టీ ధర్నా
 
కర్నూలు (న్యూసిటీ): పెద్దనోట్ల రద్దు అనాలోచిత చర్య అని కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్‌ రెడ్డి ఆరోపించారు. శనివారం కలెక్టరేట్‌ ఎదురుగా కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెద్ద నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. కుబేరుల కోసమే పెద్ద నోట్లను రద్దు చేశారని విమర్శించారు. బీజేపీ పాలనలో ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గిందన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఆ పార్టీకి గుణపాఠం తప్పదన్నారు. డీసీసీ అధ్యక్షుడు లక్కసాగరం లక్ష్మిరెడ్డి మాట్లాడుతూ.. పెద్ద నోట్ల రద్దుతో దేశానికి కీడు జరిగిందన్నారు. నగదు కొరతతో రైతులు పంటలు సాగు చేసుకోలేకపోయారని.. జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్‌ ఆకెపోగు వెంకటస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద నోట్ల రద్దుతో దేశంలో వంద మందికిపైగా ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. ఇప్పటికి 50 రోజుల గడువు దాటినా పరిస్థితి చక్కబడలేదన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ సీహెచ్‌ విజయమోహన్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. ధర్నాలో మాజీ ఎమ్మెల్యే మదన్‌గోపాల్, డీసీసీ ఉపాధ్యక్షుడు పెద్దారెడ్డి, మైనార్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు అంజాద్‌ అలీఖాన్, డీసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌ రెడ్డి, డీసీసీ కార్యదర్శులు పర్ల రమణారెడ్డి, వై ప్రభాకర్‌రెడ్డి, విజయల్‌రెడ్డి, జావీద్ తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement
Advertisement