చైల్డ్‌హోమ్‌కు బిహార్‌ బాలలు | Sakshi
Sakshi News home page

చైల్డ్‌హోమ్‌కు బిహార్‌ బాలలు

Published Sat, Jul 23 2016 10:45 PM

చైల్డ్‌హోమ్‌కు బిహార్‌ బాలలు - Sakshi

రైల్వేగేట్‌ : కలకత్తా నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న హౌరా ఎక్స్‌ప్రెస్‌ రైలు నుంచి అదుపులోకి తీసుకున్న 74 మంది బిహార్‌ రాష్ట్ర బాలలను పోలీసులు శనివారం సాయంత్రం వరంగల్‌ కొత్తవాడలోని చైల్డ్‌హోమ్‌కు తరలించారు. బాలుర తరలింపు విషయమై షీ టీమ్‌ సీఐ శ్రీలక్ష్మి మాట్లాడుతూ ఈ బాలలు ఎక్కడ చదువుతున్నారు.. ఎక్కడికెళ్తున్నారనే విషయాలను సేకరిస్తున్నామని తెలిపారు. వా రు వాస్తవంగా మదర్సాలలో చదివేందుకు వెళితే ఆయా మదర్సాల నుంచి తగిన ఆధారాలు కూడా తీసుకుని ఆ తర్వాత తగిన విధంగా స్పందిస్తామన్నారు. చైల్‌ వెల్ఫేర్‌ కమిటీ చైర్‌పర్సన్‌ అనితారెడ్డి, చైల్డ్‌లైన్‌ ప్రతినిధులు సిద్దార్థ, శ్రీకాంత్, సోషల్‌కుమార్‌తో సివిల్, రైల్వే పోలీసులు ఉన్నారు. 
 
మదర్సాల్లో చదివించేందుకు తీసుకెళ్తున్నాం 
కాగా ఈ విషయమై బిహార్‌కు చెందిన ఎండీ తహజిబుల్, ఎండీ ముజాదిన్, షకీల్‌అహ్మద్, అబ్దుల్లా మాట్లాడుతూ బిహార్‌లోని పూర్ణియా, మాధవన్‌ జిల్లాలకు చెందిన బాలలను హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్‌ జిల్లాల్లోని మదర్సాలలో చది వించేందుకు తీసుకెళ్తున్నామని, వారిని పనిలో పెట్టడానికి కాదని తెలిపారు. రంజాన్‌ సెలవులకు బిహా ర్‌కు వెళ్లిన బాలలు తిరిగి మదర్సాలలో చేరేందుకు వెళుతున్నట్లు వారు వివరించారు.
 
కాజీపేటలో ఇద్దరు బాలలు.. 
కాజీపేట రూరల్‌ : వరంగల్‌ రైల్వేస్టేలో 74 మంది బాలలను దింపాక హౌరా ఎక్స్‌ప్రెస్‌ రైలులోనే ఉండిపోయిన ఇద్దరు బాలలను అదుపులోకి తీసుకున్నట్లు కాజీపేట జీఆర్‌పీ సీఐ మధుసూదన్‌ శనివారం రాత్రి తెలిపారు. షఫీక్‌ అనే వ్యక్తి హౌరా ఎక్స్‌ప్రెస్‌లో ఇద్దరు బాలలను వికారాబాద్‌కు తీసుకెళ్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. 

Advertisement
Advertisement