రెండు బైక్‌లు ఢీ.. యువకుడి మృతి | Sakshi
Sakshi News home page

రెండు బైక్‌లు ఢీ.. యువకుడి మృతి

Published Mon, Jun 6 2016 9:50 AM

bike accident, one person dead

గొల్లప్రోలు(తూర్పుగోదావరి): ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం చెందుర్తి పెద్ద చెరువు వద్ద ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగింది. కత్తిపూడికి చెందిన యువకుడు(24) బైక్ పై వెళ్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనం ఢీకొట్టడంతో.. అతను అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
Advertisement