అన్ని పీహెచ్‌సీల్లో బయోమెట్రిక్‌ విధానం | Sakshi
Sakshi News home page

అన్ని పీహెచ్‌సీల్లో బయోమెట్రిక్‌ విధానం

Published Tue, Aug 23 2016 12:23 AM

అన్ని పీహెచ్‌సీల్లో బయోమెట్రిక్‌ విధానం - Sakshi

  • వారంలోగా ఏర్పాటు చేయకుంటే చర్యలు తప్పవు
  • సెప్టెంబర్‌ నుంచి క్లస్టర్‌ స్థాయి సమావేశాలు
  • హన్మకొండ అర్బన్‌ : జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సెప్టెంబర్‌ ఒకటి నాటికి పూర్తిస్థాయి లో బయోమెట్రిక్‌ హాజరు యంత్రాలు వినియోగంలో ఉండాలని కలెక్టర్‌ వాకాటి కరుణ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో పీహెచ్‌సీ వైద్యాధికారులతో సోమవారం రాత్రి నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ బయోమెట్రిక్‌ విషయంలో గతంలో చెప్పినప్పటికీ అధికారులు చాలావరకు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటì కే చాలా సమయం ఇచ్చాను.. ఇకపై ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. బయోమెట్రిక్‌ అమలు బాధ్యతలు జిల్లా సమాచార అధికారి విజయ్‌కుమార్‌కు అప్పగించారు. జిల్లాలో 75శాతం పీహెచ్‌సీల పనితీరు మెరుగున పడిందని, మిగతా 25శాతం కూడా దారిలోకి రావాల్సి ఉందని ఆమె పేర్కొన్నారు. పీహెచ్‌సీల్లోని పాత సామగ్రిని తొగించే విషయంలో అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే సెప్టెబర్‌లో క్లస్టర్ల వారీగా సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని డీఎంహెచ్‌ఓ సాంబశివరావును ఈ సందర్భంగా ఆదేశించారు. జిల్లాను వైద్యరంగంలో రాష్ట్రానికి ఆదర్శంగా తీర్చిదిద్దడంలో అందరూ భగస్వాములు కావాలని కలెక్టర్‌ కోరారు.  

Advertisement
Advertisement