బ్లాక్‌ బలి | Sakshi
Sakshi News home page

బ్లాక్‌ బలి

Published Fri, Apr 28 2017 12:17 AM

బ్లాక్‌ బలి

ఏలూరు (సెంట్రల్‌): జిల్లావ్యాప్తంగా బాహుబలి–2 ఫీవర్‌ అభిమానులను ఊపేస్తోంది. జిల్లాలోని 90 శాతం ధియేటర్లలో శుక్రవారం బాహుబలి–2 విడుదల కానుంది. ఏలూరు, భీమవరంలోని అన్ని స్క్రీన్లలో సినిమా విడుదల చేయనున్నారు. మొదటిరోజే సినిమా చూడాలన్న అభిమానుల తాపత్రయాన్ని డిస్ట్రిబ్యూటర్లు సొమ్ము చేసుకుంటున్నారు. పెంచిన ధర ప్రకారం రూ.200కు విక్రయించాలి్స న టికెట్‌ను రూ.900 నుంచి రూ.1,800 వరకు విక్రయిస్తున్నారు. భీమవరంలో రూ.3 వేల వరకు వసూలు చేసినట్టు తెలిసింది. బెనిఫిట్‌ షో క్రేజ్‌ను డిస్ట్రిబ్యూటర్లు సొమ్ములు చేసుకుంటున్నారు. 10 రోజుల పాటు ఉదయం 7.30 గంటల నుండి అర్ధరాత్రి  2.30 గంటల వరకు ఆరు షోలు ప్రదర్శించేందుకు జిల్లా అధికారులు అనుమతులు ఇచ్చారు. అయితే గురువారం రాత్రి 9.30 గంటల నుంచి బెనిఫిట్‌ షోలు ప్రదర్శించారు. ఈ షోకు సంబంధించిన టికెట్లను ఒకరోజు ముందుగానే విక్రయించారు. టికెట్‌ ధర కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తున్నా చర్యలు తీసుకోవాలి్సన సంబంధిత శాఖల అధికారులు సైతం చూసీచూడనట్టు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది.
రూ.1,200 వరకు విక్రయాలు
జిల్లాలో సుమారు 125 ధియేటర్లలో సినిమా ప్రదర్శించనున్నారు. పదిరోజుల పాటు ఆరు షోలను ప్రదర్శించేందుకు, రూ.100 టికెట్‌ను రూ.200 విక్రయించేందుకు ఇప్పటికే అధికారులు అనుమతులు ఇచ్చారు. బెనిఫిట్‌ షోకు ఏలూ రులోని 11 థియేటర్లలో అన్ని విభా గాలకు చెందిన టికెట్లను అభిమాన సం ఘాల  నాయకులు థియేటర్‌ యాజమాన్యం దగ్గర నుంచి వాస్తవ ధరల కంటే అధిక ధరలకు కొనుగోలు చేశారు. అధికారులు పట్టించుకోకపోవడానికి కార ణం పెద్ద ఎత్తున మాముళ్లు తీసుకోవ డమే అని సమాచారం. లా అండ్‌ ఆర్డర్‌  సమస్య వస్తుందనే వంకతో నగరంలోని అన్ని థియేటర్ల యాజమాన్యాల నుంచి ఓ టీడీపీ నాయకుడు పెద్ద మొత్తంలో నగదును పోలీసు అధికారులకు అందించినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement