పయనమెటు? | Sakshi
Sakshi News home page

పయనమెటు?

Published Sat, Jan 7 2017 11:29 PM

పయనమెటు? - Sakshi

– జిల్లాలో పెరుగుతున్న బీపీఎల్‌ కుటుంబాలు
– జిల్లా జనభా 40.81 లక్షలు
– దారిద్ర్యరేఖకు  దిగువ ఉన్న జనాభా 37.31 లక్షలు


అనంతపురం అర్బన్‌ : పేదల ఆర్థికాభివృద్ధి, సంక్షేమం కోసం పథకాలను అమలు చేస్తున్నామని పాలకులు చెబుతున్నా.. మరోవైపు  జిల్లాలో దారిద్ర్యరేఖకు దిగువన (బీపీఎల్‌) ఉన్నవారి సంఖ్య పెరుగుతోంది.   జిల్లా జానాభాను పరిశీలిస్తే  91.42 శాతం మంది దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నారని స్పష్టమవుతోంది.
 
 దారిద్ర్యరేఖకు దిగువన 37.31 లక్షల మంది
    జిల్లాలో 2011 జనభా లెక్కల ప్రకారం  40,81,148 మంది జనాభా ఉంది.  ఇందులో 37,31,345 మంది దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నారు. జిల్లాలో బీపీఎల్‌ కార్డులు 11.34 లక్షలు ఉన్నాయి. ఇందులో సభ్యులు 34,78,088 మంది ఉన్నారు. కొత్తగా జిల్లాలో 84,419 బీపీఎల్‌ కార్డులు ఇచ్చారు. వీటిలో 2,53, 257 మంది  ఉన్నారు.   పింక్‌ కార్డులు (ఏపీఎల్‌) 65 వేలు మాత్రమే ఉన్నాయి. ఇందులో 1.95 లక్షలు సభ్యులు ఉన్నారు.

జిల్లాపై కరువు ప్రభావం..
    జిల్లాలో దారిద్ర్యరేఖకు దిగువ ఉన్నవారి సంఖ్య పెరుగడానికి వరుస కరువులే  కారణమని తెలుస్తోంది.  జిల్లా జనాభా 40.81 లక్షల్లో మూడో వంతు గ్రామీణ ప్రాంతంలోనే ఉన్నారు. గ్రామీణ జనభా 29,35,437 మంది ఉండగా, పట్టణ ప్రాంతాల్లో 11,45,711 మంది ఉన్నారు. పంటలులేక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆర్థికంగా చితికి పోతున్నారు. ఒకప్పుడు భూస్వాములైన వారు ఇప్పుడు దారిద్రా ‍్యన్ని అనుభవిస్తున్నారు. చిన్న, సన్నకారు రైతు కుటుంబాలు కూడా కూలీ పనులకు వెళ్లే దుస్థితి .  ఇక వ్యవసాయ కూలీలు కూడా వలస పోతున్నారు. ఇలాంటి పరిస్థితులే జిల్లా ప్రజలను దారిధ్య్ర దిశగా తీసుకెళుతున్నాయి. అందుకే జిల్లాలో దారిధ్య రేఖకు దిగువన ఉన్న వారి సంఖ్య పెరుగుతోందనే విషయం స్పష్టమవుతోంది.

Advertisement
Advertisement