అన్ని గోదాంలను వినియోగంలోకి తెస్తాం | Sakshi
Sakshi News home page

అన్ని గోదాంలను వినియోగంలోకి తెస్తాం

Published Fri, Aug 5 2016 8:32 PM

అన్ని గోదాంలను వినియోగంలోకి తెస్తాం

దామరచర్ల : జిల్లాలో ఉన్న అన్ని గోదాంలను వినియోగంలోకి తెస్తామని మార్కెటింగ్‌ శాఖ జేడీఏ లక్ష్మణుడు తెలిపారు. శుక్రవారం దామరచర్ల సబ్‌మార్కెట్‌ యార్డులో విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో జిల్లాలో 1.55లక్షల మెట్రిక్‌టన్నుల సామర్థ్యమున్న 121 గోదాంలు ఉన్నాయన్నారు. తెలంగాణ  రాష్ట్రంలో గత రెండేళ్లుగా 1.25లక్షల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల 31 గోదాంల నిర్మాణాలను ప్రారంభించామన్నారు. వీటి నిర్మాణం 80 శాతం పూర్తయినట్టు తెలిపారు. ఈ గోదాంలను పీడీఎస్‌ బియ్యం, ఫెస్టిసైడ్స్‌ నిల్వలకు వినియోగిస్తామన్నారు. రైతులు రైతు బంధు పథకం కింద తమ పంట ఉత్పత్తులను దాచుకోవచ్చునన్నారు. తమ శాఖ ఆధ్వర్యంలో లక్ష మొక్కలు నాటాలనేది లక్ష్యమని, ఇప్పటి వరకూ 34 వేల మొక్కలు నాటినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ అలీం, కార్యదర్శి అనంతయ్య, శ్రీనివాస్, సైదులు, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement