Sakshi News home page

మహిళా నేత దారుణ హత్య

Published Sat, Apr 2 2016 1:50 AM

మహిళా నేత దారుణ హత్య - Sakshi

కొట్టి, తాడుతో ఉరి బిగించి చంపేసిన దుండగులు
డాగ్‌స్క్వాడ్, క్లూస్ టీంతో పరిశీలన
వివరాలు సేకరించిన ఎస్పీ రెమా రాజేశ్వరి
కొట్టి, తాడుతో ఉరి బిగించి చంపేసిన దుండగులు
డాగ్‌స్క్వాడ్, క్లూస్ టీంతో పరిశీలన
వివరాలు సేకరించిన ఎస్పీ రెమా రాజేశ్వరి

వికారాబాద్ రూరల్: వడ్డెర సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా నాయకురాలు దారుణహత్యకు గురయ్యారు. దుండగులు ఆమెపై దాడి చేసి తాడుతో ఉరేసి చంపేశారు.  కలకలం రేపిన ఈ ఘటన వికారాబాద్ మున్సిపల్ పరిధిలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాలు.. తాండూరుకు చెందిన వరలక్ష్మి(32) వడ్డెర సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా నాయకురాలు. ఆమె తాండూరు ఓ బ్యూటీపార్లర్‌ను నడుపుతూ అక్కడే తన తల్లి, ఇద్దరు చెల్లెళ్లతో కలిసి ఉండేది. శుక్రవారం ఉదయం 7 గంటలకు వికారాబాద్ అనంతగిరిపల్లి సమీపంలో ఆమె మృతదేహంగా కనిపించింది. పశువుల కాపరులు చెప్పడంతో స్థానిక కౌన్సిలర్ భరత్ సమాచారంతో సీఐ రవి ఘటనా స్థలానికి చేరు కున్నారు.

మృతదేహం బోర్లాపడి ఉండడం తో హతురాలికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. మృతదేహానికి పక్కనే పడిఉన్న పర్సు ను పోలీసులు పరిశీలించారు. అందులో ని ఫొటోలు, వివరాల ఆధారంగా వరలక్ష్మిగా గుర్తించారు. వరలక్ష్మి తలపై బండరాళ్లతో మోదిన ఆనవాళ్లు, మెడకు ఉరివేసినట్లుగా ఓ తాడు ఉంది. పోలీసు జాగిలాలు ఘటనా స్థలం నుంచి సమీపంలో ఉన్న సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలకు.. అక్కడి నుంచి పక్కనే ఉన్న ఓ పొలంలోకి వెళ్లింది. ఎస్పీ రెమా రాజేశ్వరి, ఏఎస్పీ వెంకటస్వామి, డీఎస్పీ స్వామి పరిశీలించారు. వరలక్ష్మి చెల్లెళ్లు తమ కుటుంబీకులంతా వచ్చే వరకు మృతదేహాన్ని తరలించేది లేదని భీష్మించారు.

డీఎస్పీ స్వామి వారికి నచ్చజెప్పారు. వరలక్ష్మి గురువారం రాత్రి 8.30 గంటలకు తనతో ఫోన్‌లో మాట్లాడిందని ఆమె సోదరి తెలిపింది. భూమికి సం బంధించిన పనిపై వెళ్లాలని.. వారి వాహనంలోనే ఉన్నాను.. ఇంటికి వస్తున్నట్లు చెప్పిం దని తెలిపింది. పోలీసులు ఘటనా స్థలిలో కొన్ని లేఖలు స్వాధీనం చేసుకున్నారు. కేసు మిస్టరీ ఛేదనలో ఇవి కీలకం కానున్నాయి.  సీఐ రవి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

24 గంటల్లో పట్టుకుంటాం: ఎస్పీ
వికారాబాద్ : వరలక్ష్మిని హత్య చేసిన వారిని 24 గంటల్లో పట్టుకుంటామని ఎస్పీ రెమా రాజేశ్వరి పేర్కొన్నారు. శుక్రవారం ఆమె తన కార్యాలయంలో మాట్లాడారు. వరలక్ష్మి గురువారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు బస్సులో బయలుదేరి వెళ్లి ఎంజీబీఎస్‌లో సాయంత్రం దిగినట్లు, వెంటనే తిరిగి బస్సులో మొయినాబాద్‌కు 5.17 గంటలకు వచ్చినట్లు తెలుస్తోందన్నారు. వరలక్ష్మి ఫోన్ కాల్‌డేటాను పరిశీలించి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు 4 పోలీసు బృందాలను ఏర్పాటు చేశామన్నారు. కొందకరిపై అనుమానం వ్యక్తం చేస్తూ హతురాలి చెల్లెలు నిర్మల పోలీసులకు ఫిర్యాదు చేసిందని ఎస్పీ తెలిపారు.

Advertisement
Advertisement