సామాజిక హక్కుల సాధనకు బస్సుయాత్ర | Sakshi
Sakshi News home page

సామాజిక హక్కుల సాధనకు బస్సుయాత్ర

Published Sun, Feb 5 2017 12:11 AM

bus tour for social rights

అనంతపురం అర్బన్‌ : అణగారిన, వెనుబడిన వర్గాల హక్కుల సాధన, చైతన్యం కోసం సామాజిక హక్కుల వేదిక ఆధ్వర్యంలో మార్చి 4 నుంచి జిల్లాలో బస్సుయాత్ర సాగుతుందని వేదిక నాయకులు తెలిపారు. శనివారం స్థానిక బళ్లారి బైపాస్‌లోని వైభవ్‌ రెసిడెన్సీలో వేదిక జిల్లా, నియోజకవర్గ స్థాయి నాయకుల సమావేశం జరిగింది. వేదిక గౌరవాధ్యక్షుడు ఎస్‌ఆర్‌ నాగభూషణం ఆధ్యక్షతన జరిగిన సామావేశంలో జిల్లా అధ్యక్షుడు డి.జగదీశ్‌ మాట్లాడారు.

వేదిక ఆధ్వర్యంలో బస్సు యాత్ర ఈ నెల 26న శ్రీకాకుళం ఇచ్చాపురంలో ప్రారంభమైందన్నారు. మార్చి 4 నుంచి 6వ తేదీ వరకు జిల్లాలో సాగుతుందన్నారు. 7న జిల్లా కేంద్రంలో ముగింపు సభ నిర్వహిస్తామన్నారు. యాత్రను, ముగింపు సభను జయప్రదం చేయడానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల నాయకులు కృషి చేయాలన్నారు. సమావేశంలో నాయకులు మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ నూర్‌ మహమ్మద్, కనగానపల్లి జెడ్పీటీసీ ఈశ్వరయ్య, ఖలీఖుల్లాఖాన్, ఎంఎస్‌రాజు, దేవళ్ల మురళీ, మైనుద్దీన్, బోరంపల్లి ఆంజనేయులు, పద్మావతి, జాఫర్, కేశవ్‌నాయక్, రాప్తాడు సర్పంచ్‌ ఆకుల వెంకటరాముడు పాల్గొన్నారు.
 
15 నుంచి నియోజవకర్గాల్లో సమావేశాలు : జిల్లాలో బస్సుయాత్ర విజయంతం చేసేందుకు ఈ నెల 15నుంచి నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నామని వేదిక నాయకులు తెలిపారు. 15న రాయదుర్గం, కళ్యాణదుర్గంలోనూ, 16న మడకశిర, హిందూపురం, 17న ఉరవకొండ, గుంతకల్లు, 18న పుట్టపర్తి, ధర్మవరం, 19న తాడిపత్రి, శింగనమల, 20న పెనుకొండ, రాప్తాడు, 21న కదిరి, అనంతపురం నియోజకవర్గాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సమావేశం నిర్వహిస్తామన్నారు.

Advertisement
Advertisement