కేబుల్‌ వైర్ల చోరీ | Sakshi
Sakshi News home page

కేబుల్‌ వైర్ల చోరీ

Published Fri, Aug 26 2016 1:49 AM

cable wires theft

తణుకు : ఇరగవరం మండలంలో పలుచోట్ల ఇటీవల కేబుల్‌ నెట్‌వర్క్‌ వైర్లు చోరీకి గురవుతున్నాయి. గురువారం మధ్యాహ్నం పెద్దిరెడ్డిపాలెం వద్ద ఏపీ 37 సీఎం 6080 కారులో వచ్చిన కొందరు వైర్లను తెంచుకుపోతుండగా షిర్డీసాయి కేబుల్‌ నెట్‌వర్క్‌ నిర్వాహకులు స్థానికుల సాయంతో అడ్డుకున్నారు. దీంతో చోరీకి వచ్చిన వారు కారులో పరారయ్యారు. వారం రోజులుగా కేబుల్‌ వైర్లు చోరీకి గురువుతున్నాయని, వాటిని అపహరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కేబుల్‌ నెట్‌వర్క్‌ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 

Advertisement
Advertisement