హ్యాండ్‌బాల్‌ పోటీల్లో ప్రకాశం సత్తా | Sakshi
Sakshi News home page

హ్యాండ్‌బాల్‌ పోటీల్లో ప్రకాశం సత్తా

Published Wed, Jul 27 2016 1:02 AM

sports - Sakshi

ఒంగోలు సబర్బన్‌:
- రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానం సాధించిన బాలబాలికల జట్లు
-జాతీయ జట్టులో జిల్లాకు స్థానం
-అభినందించిన కలెక్టర్‌ సుజాత శర్మ, ఎస్పీ త్రివిక్రమ వర్మ
జాతీయ స్థాయి సబ్‌ జూనియర్‌ హ్యాండ్‌ బాల్‌ పోటీలకు జిల్లా క్రీడాకారులు ఎంపికయ్యారు. ఈ నెల 22 నుంచి 24 వరకు కర్నూల్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి రాష్ట్ర స్థాయి పోటీల్లో బాలురు, బాలికల జట్లు ద్వితీయ స్థానం సాధించడంతో ఈ ఘనత సాధించారు. విజేతలు ప్రకాశం భవన్‌లోని సీపీఓ కాన్ఫరెన్స్‌ హాలు వద్ద కలెక్టర్‌ సుజాత శర్మను కలవడంతో.. ఆమె అభినందించారు. స్థానిక ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ సీ.ఎం. త్రివిక్రమ వర్మ అభినందనలు తెలిపారు. జాతీయ జట్టు ప్రాబబుల్స్‌ను రాష్ట్ర హ్యాండ్‌ బాల్‌ అసోసియేషన్‌ ఎంపిక చేసింది. బాలికల విభాగంలో జిల్లాకు చెందిన వి.అనూష, పి.లావణ్య, వి.మనీష, వి.జ్యోతిలు ఎంపికయ్యారు. బాలుర విభాగంలో ఓంప్రశాంత్‌ గణేష్, కె.మణికుమార్, ఎన్‌.శ్యాంబాబు, వై.జస్వంత్‌లు ఎంపికయ్యారు. జిల్లా హ్యాండ్‌ బాల్‌ అసోసియేషన్‌ ప్రెసిండెంట్‌ ఎస్‌.చంద్రశేఖరరావు, సెక్రటరీ జె.కోటేశ్వరరావు, కోశాధికారి జె.నారాయణరావు, ఏపీ స్టేట్‌ ఈసీ మెంబర్‌ పి.ఎం.నరిసింహారావు, పి.సత్యనారాయణ, కోచ్‌లు జి.గురుప్రసాద్, పి.విజయకుమార్‌లు ప్రశంసలు అందుకున్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement