రూ.19 లక్షల విలువైన గుట్కాల పట్టివేత | Sakshi
Sakshi News home page

రూ.19 లక్షల విలువైన గుట్కాల పట్టివేత

Published Fri, Sep 2 2016 12:11 AM

రూ.19 లక్షల విలువైన గుట్కాల పట్టివేత

  • ఏడుగురు నిందితుల అరెస్ట్‌
  • పోచమ్మమైదాన్‌ : గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్న గుట్కాలు, అంబర్‌ ప్యాకెట్ల మట్టెవాడ పోలీసులు భారీ మెుత్తంలో పట్టుకున్నారు. నగరంలో పిన్నావారి వీధిలో గుట్కా, పొగాకు ఉత్పత్తులను రహస్యంగా అమ్ముతున్నారని సమాచారం రావడంతో ఎస్సై రంజిత్‌ కుమార్‌ హెyŠ కానిస్టేబుల్‌ వెంకన్న, శ్రీనివాస్, కానిస్టేబుళ్లు దుర్గాప్రసాద్, వీరస్వామి, అశోక్‌ కుమార్, సోమేశ్వర్‌ కలిసి గురువారం తెల్లవారుజామున దాడులు నిర్వహించారు. దాడుల్లో రూ. 9,72,050 విలువ చేసే గుట్కాలు, అంబర్లు లభించాయి. పిన్నావారి వీధిలోని ప్రసాద్‌ స్వీట్‌ హౌస్‌ యజమాని రవ్వ వరప్రసాద్‌ వద్ద రూ. 4.77 లక్షలు, రాజ్‌కమల్‌ ఫ్యాన్సీ స్టోర్‌ షాపు యజమాని రాజ్‌ పురోహిత్‌ జోవహార్‌ సింగ్‌ వద్ద రూ.77,250, అంబిక జన రల్‌ స్టోర్‌ యజమాని ఆడెపు నాగేశ్వర్‌ రావు రూ.6.44 లక్షలు, హరి కిరాణ షాప్‌ యజమాని చిదర కళ్యాణ్‌ వద్ద రూ.6.17లక్షలు, అంబిక జనరల్‌ స్టోర్‌ యజమాని బెజ్జం గోపి వద్ద రూ.1,37,200, శివ జనరల్‌ స్టోర్‌ యజమాని కందుకురి శశిధర్‌ వద్ద రూ.19,600 విలువైన గుట్కాలను స్వాధీనం చేసుకున్నారు. వరంగల్‌ ఏసీపీ సురేంద్రనాథ్‌ వారి అరెస్ట్‌ చూపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిషేధించిన గుట్కాలు, పొగాకు ఉత్పత్తులు అమ్మితే చట్టరీత్యానేరం అన్నారు. పాన్‌షాపుల్లో విక్రయిస్తే పాన్‌షాప్‌లో ఉన్న వస్తువులన్ని సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. 

Advertisement
Advertisement