రోడ్డు ప్రమాదంలో ఎస్‌ఐకి తీవ్రగాయాలు | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఎస్‌ఐకి తీవ్రగాయాలు

Published Mon, Nov 9 2015 1:47 PM

రోడ్డు ప్రమాదంలో ఎస్‌ఐకి తీవ్రగాయాలు - Sakshi

రంగారెడ్డి: హైదరాబాద్ శివార్లలో ఔటర్ రింగురోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఎస్‌ఐకి తీవ్రగాయాలయ్యాయి. అప్పా పోలీస్ అకాడమీకి సమీపంలో ఫార్చూనర్ కారు, షిఫ్ట్ కారును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

ఫార్చూనర్ కారులో ప్రయాణిస్తున్న ఎస్‌ఐ జానకిరామ్‌కు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన ఎస్‌ఐను 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. సకాలంలో షిఫ్ట్ కారులో బెలూన్లు తెరుచుకోవడంతో  పెను ప్రమాదం తప్పింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. జానకిరామ్ సైబరాబాద్‌లోని సీఐఎస్‌ఎఫ్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement