సైబర్‌ సెక్యూరిటీపై జాగ్రత్త అవసరం | Sakshi
Sakshi News home page

సైబర్‌ సెక్యూరిటీపై జాగ్రత్త అవసరం

Published Tue, Aug 16 2016 7:12 PM

సైబర్‌ సెక్యూరిటీపై జాగ్రత్త అవసరం

భీమవరం: కంప్యూటర్లలో నిక్షిప్తమైన సమస్థ సమాచారం ఇతరుల పరం కాకుండా సైబర్‌ సెక్యూరిటీపై జాగ్రత్తగా ఉండాలని ఆంధ్రా వర్శిటీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పీఎస్‌ అవధాని అన్నారు. భీమవరం శ్రీవిష్ణు మహిళా ఇంజినీరింగ్‌ కళాశాలలో కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ విభాగం ఆధ్వర్యంలో ‘సైబర్‌ సెక్యూరిటీ అండ్‌ ఫోరెన్సిక్స్‌’ అంశంపై ఐదు రోజుల పాటు జరిగేlజాతీయ స్థాయి శిక్షణ శిబిరాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. సైబర్‌ సెక్యూరిటీ విధానాలు, నిపుణులు అవలంబించే ప్రక్రియ, సమాచారం దోపిడీ, వెబ్‌సైట్‌ హ్యాకింగ్, క్రెడిట్, డెబిట్‌ కార్డుల మోసాలపై అవగాహన కల్పించారు. ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జి.శ్రీనివాసరావు, వైస్‌ ప్రిన్సిపాల్‌ పి.శ్రీనివాసరాజు, వి.శ్రీకాంత్, వి.పురుషోత్తమరాజు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement