నగదు మార్పిడిపై కొరడా | Sakshi
Sakshi News home page

నగదు మార్పిడిపై కొరడా

Published Fri, Nov 18 2016 3:52 AM

నగదు మార్పిడిపై కొరడా - Sakshi

నేటి నుంచి నోట్ల మార్పిడి రూ.2 వేలకు పరిమితం
మరింత తీవ్రం కానున్న కరెన్సీ కష్టాలు
స్వైప్ మెషీన్ల వినియోగంపై ప్రత్యేక దృష్టి
సహకార బ్యాంకులకు నగదు
నిలిపివేతపై డీసీసీబీ ఉద్యోగుల ఆగ్రహం    
నేటి నుంచి దశలవారీగా
ఉద్యమానికి పిలుపు   ఆర్టీసీ టోల్ వసూలుపై ప్రజానీకం మండిపాటు
 

క్రితం దానిని మరో రూ.500కు పెంచింది. దీంతో రూ.4,500 వస్తాయని భావించి బ్యాంకుకు వెళ్లిన ప్రజానీకానికి రూ.4వేలు మాత్రమే అందుతూ వచ్చాయి. తాజాగా ఆర్థిక శాఖ కార్యదర్శి ఈ మొత్తాన్ని రెండువేలకు పరిమితం చేస్తున్నట్లు గురువారం ప్రకటించారు. దీంతో శుక్రవారం బ్యాంకుల వద్దకు వెళదామని బావించిన ఖాతాదారులు కూడా బ్యాంకుల వద్దకు పరుగుపెట్టారు. ధాన్యం విక్రయించిన రైతులకు నగదును ఆన్‌లైన్ ద్వారా పంపాలని, ఇదే క్రమంలో రైతులు తమ ఖాతాలనుంచి వారంలో రు.25వేల వరకు డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం వెలువడింది. కల్యాణాలకు సంబంధించి రూ.2.5  లక్షల వరకు డ్రా చేసుకునేందుకు రిజర్వుబ్యాంకు సడలింపు ఇచ్చింది.   చివరకు నగదు కొరత పిల్లల పుట్టినరోజు వేడుకలపై కూడా పడింది. చాక్లెట్లు, బిస్కెట్లు లాంటివి కొనేందుకు కూడా సమస్యలు ఎదురవుతున్నాయి. బ్యాంకర్లతోపాటు వర్తకులు కూడా స్వైపింగ్ మెషీన్ల వినియోగం, విస్తరణపై దృష్టిపెట్టాలని అధికారులు పేర్కొంటున్నారు. రైల్వేస్టేషన్‌లు, బస్టాండ్లు, రైతు బజార్లలో బ్యాంకులు స్వైపింగ్ మెషీన్లను ప్రవేశపెట్టాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

నేటి నుంచి సహకార బ్యాంకు ఉద్యోగుల ఆందోళన ..
సహకార బ్యాంకులకు నగదు లావాదేవీలను నిలిపివేస్తూ రిజర్వుబ్యాంకు నిర్ణయం తీసుకోవడంపై సహకార బ్యాంకు ఉద్యోగస్తులు ఆందోళనకు సిద్ధమయ్యారు. ఈ చర్యవల్ల సహకార బ్యాంకులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతాయని, రైతాంగానికి తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయని ఏపీ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంవి మురళీప్రసాద్ తెలిపారు. ఆర్‌బీఐ, కేంద్రప్రభుత్వ చర్యలు చివరకు డీసీసీబీల మనుగడకే ప్రమాదంగా మారనున్నాయన్నారు. ఆల్ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్‌స ఎంప్లాయీస్ ఫెడరేషన్ పిలుపుమేరకు ఈనెల 18న జిల్లా కేంద్రసహకార బ్యాంకు బ్రాంచీల ముందు మద్యాహ్న భోజన విరామసమయంలో ఆందోళన కార్యక్రమాలు, 22వ తేదీ రాష్ట్ర రాజధాని ప్రాంతంలో ప్రధాన కార్యాలయాల వద్ద ధర్నా, 25వ తేదీ డీసీసీబీ ఉద్యోగులందరూ ఒకరోజు సమ్మె చేపడుతున్నట్లు ప్రకటించారు.
 
ఆర్టీసీపై ప్రజాగ్రహం..
ఆర్టీసీ అధికారులు ఫ్లెక్సీ ఫేర్ పేరుతో రోజుకో రేటు చొప్పున టిక్కెట్ల రేట్లను నిర్ణయిస్తుంది. కానీ ఈనెల 10వ తేదీ నుంచి టోల్‌గేట్ల వద్ద టోల్‌ట్యాక్స్‌ను కేంద్రప్రభుత్వం తాత్కాలికంగా రద్దుచేసింది. దీని ప్రకారం టోల్‌ఫీజును కూడా ఆర్టీసీ ప్రయాణికుని నుంచి వసూలు చేయడం మానుకోవాలి. కానీ  వసూలుచేస్తూనే ఉందంటూ ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ వెళ్లాలంటే రెండు టోల్‌గేట్లు, తిరుపతికి మూడు టోల్‌గేట్ల ప్రకారం ఫీజులు వసూలుచేస్తున్నార ని, ప్రభుత్వ ఉత్వర్వుల మేరకు ఈనెల 24వరకు టోల్ ఫీజులు వసూలుచేయరాదని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఆర్టీసీ ఆర్‌ఎం ఆదంసాహెబ్ వివరణ ఇస్తూ టోల్‌గేటు ఫీజును నెల మొత్తానికి కలిపి ఆర్టీసీ ముందుగానే చెల్లిస్తుందని, అందువల్ళే వసూలు చేస్తున్నామని చెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement