’జై’ట్లీ అనిపించేనా! | Sakshi
Sakshi News home page

’జై’ట్లీ అనిపించేనా!

Published Mon, Jan 30 2017 10:36 PM

’జై’ట్లీ అనిపించేనా!

సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించడంతోపాటు విభజన చట్టంలోని హామీలు వంద శాతం అమలు చేసేలా ప్రత్యేక బడ్జెట్‌ కేటాయిస్తూ భరోసా ఇవ్వాలని అందరూ కోరుకుకుంటున్నారు. 
 
పోలవరం ప్రాజెక్ట్‌ సం’గతేంటి’
జాతీయ ప్రాజెక్టుగా గుర్తించిన పోలవరానికి ఈ ఏడాదైనా బడ్జెట్‌లో కేటాయింపులు పెరుగుతాయా లేదా అన్నది చూడాలి. 2018 నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. రూ.40,351.65 కోట్ల వ్యయంతో నిర్మించే ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం రెండేళ్లుగా ఏటా రూ.100 కోట్ల చొప్పున మాత్రమే నిధులు కేటాయిçస్తూ వస్తోంది. ఇటీవల నాబార్డు నుంచి రూ.1,981.54 కోట్లు రుణం ఇప్పించింది. ఈ ఏడాది బడ్జెట్‌లో పోలవరానికి ఎంత కేటాయిస్తారు, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఎంత ఉందనే విషయం మరో 24 గంటల్లో తేలనుంది. 
దీర్ఘకాలిక డిమాండ్లను నెరవేరుస్తారా
జిల్లాలోని తీర ప్రాంతం మీదుగా వెళ్లే 216 జాతీయ రహదారి అభివృద్ధికి ఈ బడ్జెట్‌లో అయినా నిధులు కేటాయించాలన్న డిమాండ్‌ వ్యక్తమవుతోంది. ఈ జాతీయ రహదారి పూర్తయితే ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులు పెరగడంతోపాటు తీరప్రాంత అభివృద్ధికి బాటలు పడుతాయి. మరోవైపు కోటిపల్లినరసాపురం రైల్వేలైన్‌కు నిధుల కేటాయింపు అరకొరగానే ఉంది. రైల్వే బడ్జెట్‌ను విడిగా కాకుండా సాధారణ బడ్జెట్‌లోనే కలిపి ఈ సారి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. జిల్లాలో కొత్తగా ప్రకటించిన కొవ్వూరుఽభద్రాచలం కొత్త రైల్వే లైనుకు, నిడదవోలుభీమవరంనరసాపురంగుడివాడ డబ్లింగ్‌ పనులకు బడ్జెట్‌లో కేంద్రం పూర్తిస్థాయి నిధులు కేటాయిస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిందే. నరసాపురంకాకినాడ రైల్వే లైన్‌ ప్రాజెక్ట్‌ ఈసారైనా పట్టాలెక్కుతుందా లేదా అనే దానిపై మీమాసం కొనసాగుతోంది. జలరవాణా మళ్లీ తెరమీదకు వచ్చిన సంగతి తెలిసిందే. రూ.3,200 కోట్లతో బకింగ్‌కెనాల్‌ జలరవాణా పునరుద్ధరణను కేంద్రం చేపట్టింది. ప్రాథమికంగా భూసేకరణకు సంబంధించి సర్వే పనులు మొదలవుతున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు ఏమేరకు నిధులు కేటాయిస్తారనేది చర్చనీయాంశంగా ఉంది. జిల్లా అన్ని రంగాల్లో ఎంతోకొంత అభివృద్ధి సాధించినా పారిశ్రామికంగా వెనుకబడే ఉంది. ఈ నేపథ్యంలో పారిశ్రామిక ప్రోత్సాహాలు ఎంతమేరకు ఇస్తుంది, అవి జిల్లాకు ఏ మేరకు ఉపయోగపడతాయన్నది తేలాల్సి ఉంది. ఏది ఏమైనా జిల్లా అభివృద్ధి ఈ బడ్టెట్‌ బాటలు వేయాలని అందరూ కోరుకుంటున్నారు. 
 
 

Advertisement
Advertisement