ప్రముఖ చిందు యక్షగాన కళాకారుడు మృతి | Sakshi
Sakshi News home page

ప్రముఖ చిందు యక్షగాన కళాకారుడు మృతి

Published Fri, Jul 29 2016 11:22 PM

ప్రముఖ చిందు యక్షగాన కళాకారుడు మృతి

  • సంతాపం తెలిపిన మంత్రి చందూలాల్‌
  • చిన్నపెండ్యాల (ధర్మసాగర్‌ ) : చిందుయక్ష గాన కళారంగంలో తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ చిందు యక్ష కళాకారుడు గజవెల్లి సాయిలు (82) గురువారం రాత్రి అనారోగ్యంతో అతడి స్వగ్రామం చిన్నపెండ్యాలలో మృతి చెందా డు. గ్రామానికి చెందిన సాయిలు అలియాస్‌ చిం దు సాయిలుది పూర్వీకుల నుంచి చిందుయక్ష గా న కళాకారుల కుటుంబం. చిన్ననా టి నుండే ఈ రంగంపై మక్కువ పెంచుకుని పలు వేషాలువేసి తనదైన శైలిలో వాటిని ర క్తి కట్టించాడు. సా యిలు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వందల సంఖ్యలో చిందు యక్షప్రదర్శనలు ఇచ్చి ప్రశంసలు పొందాడు. మృతుడికి నలుగురు కుమారులు, ముగు ్గరు కూతుర్లు ఉన్నారు. సర్పంచ్‌ తాళ్ళపెల్లి సమ్మయ్య, కళాకారులు నివాళి అర్పించారు.
     
    ప్రముఖుల సంతాపం...
    కళాకారుడు సాయిలు మృతి పట్ల డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, గిరి జన సంక్షేమశాఖ మంత్రి చందూలాల్, సీఎం పేషీ స్పెషల్‌ ఆఫీసర్‌ దేశపతి శ్రీనివాస్, స్థానిక ఎమ్మెల్యే రాజయ్యలు తమ ప్రగా సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు మృతుడి కుటుంబ సభ్యులతో ఫో న్‌లో మాట్లాడి పరామర్శించి, ప్రభుత్వం తరుపున కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అంత్యక్రియలు  చిన్నపెండ్యాలలో శుక్రవారం సాయంత్రం జరిగాయి.
     
    సాయిలు మృతికి మంత్రి సంతాపం
    నయీంనగర్‌ : ప్రముఖ చిందు యక్షగానం కళాకారుడు గడ్డం సాయిలు మృతికి రాష్ట్ర గిరిజనాభివృద్ధి, పర్యాటక,సాంస్కృతిక  శాఖ మంత్రి అజ్మీరా చందులాల్‌  సంతాపం వ్యక్తం చేశారు. ఒక గొప్ప కళాకారున్ని జిల్లా కోల్పోయిందని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం కళలు, కళాకారులకు అండగా ఉంటుందని,  సాయిలు కుటుంబ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రూ.50వేల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం తరపున అందచేస్తామని మంత్రి ఒక ప్రకటనలో ప్రకటించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement