షూటింగ్‌ సందడి | Sakshi
Sakshi News home page

షూటింగ్‌ సందడి

Published Mon, Oct 10 2016 9:39 PM

షూటింగ్‌ సందడి - Sakshi

భీమవరం ప్రకాశం చౌక్‌: పట్టణంలోని యమహా షోరూమ్‌లో సోమవారం ఓ సినిమా షూటింగ్‌ జరిగింది. పట్టణానికి చెందిన గోపీవర్మ హీరోగా నటిస్తున్న చిత్రానికి వై.కృష్ణంరాజు (కాకినాడు) దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్‌గా కేరళకు చెందిన మాళవిక మీనన్‌ నటిస్తున్నారు. సీనియర్‌ నటులు శివాజీరాజా, భద్రం, వేణుగోపాల్‌ తదితరులు నటిస్తున్నట్టు దర్శకుడు కృష్ణంరాజు తెలిపారు. పది రోజుల నుంచి చిన అమిరం, భీమవరం పరిసర ప్రాంతాల్లో సినిమా షూటింగ్‌ చేస్తున్నామని చెప్పారు.
 

Advertisement
Advertisement