నా సినిమాలో ఛాన్స్‌ ఇస్తా | Sakshi
Sakshi News home page

నా సినిమాలో ఛాన్స్‌ ఇస్తా

Published Mon, Aug 1 2016 9:47 AM

నా సినిమాలో ఛాన్స్‌ ఇస్తా

శిక్షణార్థులకు హీరో ఆదిత్య ఆఫర్‌!
 మధురానగర్‌:
సతీష్‌ అడ్డాల మోడలింగ్‌ ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ పొందిన నటీనటులకు తాను తీయబోయే తదుపరి చిత్రంలో అవకాశం ఇస్తానని ప్రముఖ సినీ హీరో ఆదిత్య ఓం తెలిపారు. స్థ్ధానిక సతీష్‌ అడ్డాల మోడలింగ్‌ ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌ 5వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్బంగా ఆదివారం కొత్త బ్యాచ్‌ ప్రారంభమయ్యింది.

ముఖ్యఅతిథిగా పాల్గొన్న న్యాయవాది వేముల హజరత్తయ్యగుప్తా, రంగస్ధల నటుడు పిళ్ళాప్రసాద్‌లతో కలిసి కొత్తబ్యాచ్‌ క్లాసులను ప్రారంభించారు. ఆదిత్య ఓం మాట్లాడుతూ కృషి పట్టుదల ఉంటే జీవితంలో నిర్ధేశించుకున్న లక్ష్యాలను చేరుకోవచ్చన్నారు. తాను హీరోగా నటించిన ఫ్రెండ్స్‌ రిక్వెస్ట్‌ చిత్రం హిట్‌ అయ్యిందంటూ విద్యార్థులతో కలిసి కేక్‌ను కట్‌చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement