Sakshi News home page

నృత్య పోటీల్లో ప్రవల్లిక ప్రతిభ

Published Mon, Aug 1 2016 8:35 PM

classical dancer pravallika got prizes

రేపల్లె: గత నెల 21 నుంచి 24వ తేదీ వరకు సిమ్లాలో నిర్వహించిన ధారోహర్‌ అంతర్జాతీయ నృత్యోత్సవంలో చెరుకుపల్లికి పెదపూడి నాగశ్రీ ప్రవల్లిక ప్రతిభ కనబరిచింది. జాతీయస్థాయి నృత్య పోటీల్లో సెమీ క్లాసికల్‌ విభాగంలో ప్రథమ బహహుమతి, మరో నృత్యకారిణి మోహనతో కలిసి చేసిన కూచిపూడి జంట నృత్యంలో ద్వితీయ బహుమతిని కైవసం చేసుకుంది. జానపద నృత్య విభాగంలో తృతీయ బహుమతి దక్కించుకుంది. ఆమెను  విద్యాశాఖ ప్రాంతీయ ఉప సంచాలకురాలు పార్వతి, నాట్య గురువు కాజ వెంకట సుబ్రహ్మణ్యం, బాపట్ల డీఈవో ఎన్‌.రఘుకుమార్, ఎంఈవో పి.లాజర్, ఎంపీడీవో షేక్‌ సుభానీ, వనజాచంద్ర విద్యాలయం డైరెక్టర్‌ కొడాలి మోహన్, ప్రిన్సిపాల్‌ ఏవీ కృష్ణారావు,  ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.

adsolute_video_ad

Advertisement

What’s your opinion

Advertisement