నేటి నుంచి సీఎం ఖమ్మం టూర్ | Sakshi
Sakshi News home page

నేటి నుంచి సీఎం ఖమ్మం టూర్

Published Mon, Feb 15 2016 2:24 AM

CM khammam to tour from today

భక్త రామదాసు, సీతారామ ప్రాజెక్టులకు శంకుస్థాపన
సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ముఖ్యమంత్రి కేసీఆర్ నేటి నుంచి రెండ్రోజుల పాటు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. సోమ, మంగళవారాల్లో పర్యటనకు సంబంధించి ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. సోమవారం ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి 12 గంటలకు తిరుమలాయపాలెం చేరుకుంటారు. రోడ్డు మార్గం గుండా 12.20 గంటలకు ఎన్‌ఎస్‌పీ అతిథిగృహానికి, 12.30కు ఖమ్మం పట్టణానికి చేరుకుంటారు. 2 గంటలకు గెస్ట్‌హౌస్‌లో భోజనం తర్వాత 3 గంటల నుంచి ఖమ్మం పట్టణాన్ని సందర్శిస్తారు. సాయంత్రం 6 గంటలకు పాపిరెడ్డి ఫంక్షన్ హాల్లో జిల్లా అధికారుల సమీక్షా సమావేశంలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. రాత్రి 8.30 గంటలకు డిన్నర్ తర్వాత ఖమ్మంలోనే బస చేస్తారు.
 
 మంగళవారం ఉదయం 8.30 గంటలకు ఖమ్మం నుంచి బయల్దేరి రోడ్డు మార్గం ద్వారా 9.15 గంటలకు ముదిగొండ చేరుకుంటారు. ముతరాం గ్రామంలోని రామాలయాన్ని సందర్శిస్తారు. ముదిగొండ నుంచి 9.40కి బయల్దేరి 10.15కు తిరుమలాయపాలెం చేరుకుంటారు. అక్కడ భక్తరామదాసు పథకానికి శంకుస్థాపన చేస్తారు. 10.20 గంటలకు అక్కడ బహిరంగసభలో ప్రసంగిస్తారు. అక్కడ్నుంచి 12 గంటలకు బయల్దేరి టేకుల పల్లి మండలం రోళ్లపాడుకు వెళతారు. 12.30 గంటలకు అక్కడ సీతారామ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. 12.45కు రోళ్లపాడు ప్రజలతో మాట్లాడతారు. 2 గంటలకు భోజనం ముగించుకొని హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్‌కు బయల్దేరుతారు.

Advertisement
Advertisement