Sakshi News home page

సీఎం రాజీనామా చేయాలి

Published Sat, Sep 10 2016 1:14 AM

సీఎం రాజీనామా చేయాలి - Sakshi

 – ఎమ్మెల్యే ఐజయ్య
 
నందికొట్కూరు: ప్రత్యేక హోదా సాధించలేని సీఎం చంద్రబాబు నాయుడు వెంటనే రాజీనామా చేయాలని ఎమ్మెల్యే ఐజయ్య డిమాండ్‌ చేశారు. శుక్రవారం పట్టణంలోని తన స్వగహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే సహించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఓటుకు నోటు కేసుకు భయపడి సీఎం చంద్రబాబు...ఏపీ ప్రజల భవిష్యత్‌ను బలి చేశారని మండిపడ్డారు. ప్రజల హక్కు ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టుపెట్టిన  ధ్వజమెత్తారు. సీఎం, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకు తక్షణమే తమ పదవులకు రాజీనామ చేసి ఏపీ ప్రజలకు కోసం పోరాడాలన్నారు. శనివారం జరిగే రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మిడుతూరు జెడ్పీటీసీ సభ్యుడు యుగంధర్‌రెడ్డి, కౌన్సిలర్‌ శ్రీనివాసరెడ్డి, సీపీఎం డివిజన్‌ కార్యదర్శి వెంకటేశ్వర్లు, సీపీఐ డివిజన్‌ కార్యదర్శి రఘురామ్మూర్తి, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు చాంద్‌బాషా, ఆవాజ్‌ కమిటీ నాయకులు సలాంఖాన్‌ తదితరులు పాల్లొన్నారు.   
 

Advertisement
Advertisement