కలెక్షన్‌ కింగ్‌ | Sakshi
Sakshi News home page

కలెక్షన్‌ కింగ్‌

Published Thu, Jul 20 2017 10:33 PM

కలెక్షన్‌ కింగ్‌

కరెన్సీ కలెక్షన్‌ రహంతుల్లా హాబీ
పురాతనమంటే మక్కువ...సేకరణ ఎక్కువ

– ఇప్పటికే 200 దేశాల కరెన్సీనోట్ల సేకరణ
– మొగల్, మౌర్య, మగధ, విజయనగర రాజుల కాలం బంగారు, వెండి నాణేలు భద్రపరిచిన వైనం


ఒక్కొక్కరిది ఒక్కో హాబీ..కొందరు మొక్కులు పెంచుకుని సంబరపఽడతారు..ఇంకొందరు ట్రావెలింగ్‌ను ఇష్టపడతారు. ఇలా భిన్నమైన అభిరుచితో సమాజంలో తమకంటూ గుర్తింపును తెచ్చుకుంటారు. ఈకోవలోకే వస్తాఽడు హిందూపురానికి చెందిన వ్యాపారి రహంతుల్లా. పాత నాణేలు..కరెన్సీ సేకరించడం ఆయన హాబీ. పదో తరగతి వరకే చదివినా ప్రపంచంలోని అన్ని దేశాల నోట్లు...వాటి ప్రాముఖ్యం...ఎప్పుడు చలామణిలో ఉన్నది చెప్పడంలో ఆయన దిట్ట.  

హిందూపురం అర్బన్‌: హిందూపురం పరిగి రోడ్డులో సిమెంట్, ఐరన్‌ వ్యాపారం చేసే జీఎం రహంతుల్లాకు చిన్నప్పటి నుంచి పాత వస్తువులను సేకరించడం ఇష్టం. ఈ క్రమంలోనే నాణేలు సేకరించడఽం అలవాటు చేసుకున్నాడు. పాతనాణేలన్నా.. ప్రపంచదేశాల కరెన్సీ నోట్లన్నా అతనికి ప్రాణం. వాటిసేకరణ కోసం ఎంతదూరమైనా..ఎంత ఖర్చుయినా వెనుకాడడు.
ఇందుకోసం బెంగళూరు, ముంబాయి, హంపి, మైసూర్, హైదరాబాద్‌ నగరాలకు తరచూ ప్రయాణం చేస్తుంటాడు.

పుస్తకాలసాయంతో గుర్తింపు
ప్రాచీనకాలం నాటి నాణేలను గుర్చించేందుకు రహంతుల్లా ప్రపంచ దేశాల కరెన్సీపై పలువురు రచయితలు వివిధ బాషల్లో రాసిన పుస్తకాలను సేకరించి పెట్టుకున్నాడు. ఇతర భాషల్లోని పుస్తకాలను ఆ భాష తెలిసిన వారి వద్దకు వెళ్లి అందులోని విషయాలను తెలుగులోకి అనువాదం చేసుకుంటాడు. దాని సాయంతో నాణ౾ేల ముద్రలు, వాటి నాణ్యతను బాగా çపరీక్షించి అవి ఏ కాలం నాటివో నిర్ధారించుకుంటాడు.

ప్రపంచదేశాల కరెన్సీనోట్లు
రహంతుల్లా వద్ద సుమారు 200 దేశాలకు సంబంధించిన కరెన్సీ నోట్లు ఉన్నాయి. రూ.1 నుంచి రూ.50 వేలు, రూ.లక్ష వరకు విలువైన నోట్లు  కూడా ఉన్నాయి. ఇందులో  డాలర్, దినార్, బహాట్, షిల్లింగ్, వాటూస్, డౌగ్స్, క్యాట్స్, కోపేక్స్, సెనౌటాస్, ఫెసోస్, పోల్స్, రియల్స్, దిర్‌హం, ఓర్స్, హాలర్ట్, యాన్స్, మోస్, పుంగ్, కునా, లిపా, ఎస్‌కూడ్, బోబిబారిస్, రూపాయి ఇన్ని పేర్లతో ఉన్న కరెన్సీనోట్లు ఉన్నాయి. ఇలా 1850 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు చలామణిలో ఉన్న అన్నిరకాల కరెన్సీ నోట్లు భద్రపర్చుకున్నాడు.

చారిత్రక నేపథ్యం గల నాణేలు ఎక్కువే
సువిశాల భారత సామాజ్యాన్ని పాలించిన చక్రవర్తుల కాలంలో వినియోగించిన నాణేలు, శాసనాలు కూడా రహంతుల్లా సంపాదించాడు. అలాగే అప్పటికాలంలో చలమణిలో ఉన్న బంగారు, వెండి, సీసం వంటి లోహాలతో తయారు నాణేలు కూడా సేకరించి భద్రం చేశాడు. ఇందులో మొగల్‌ చక్రవర్తులు, మగధ, మౌర్య, ఢిల్లీసుల్తాన్, గుజరాత్‌, గుల్బార్గా సుల్తాన్స్, విజయనగర చక్రవర్తులు, మేవార్, మరాఠా, కాబ్, చోళ, సిలోన్, చతుస్‌ బనవాసీ, కోబ్‌ బిహార్, కాంచే, శతవాహన సామ్రాజ్యాధీశుల కాలంలో ఉన్న నాణేలు అనేకం ఉన్నాయి.

త్వరలోనే ఎగ్జిబిషన్‌
నాకు పురాతన వస్తువులు, పుస్తకాలు, నాణేలు సేకరించడం ఇష్టం. కొన్నేళ్లుగా ఇలా వివిధ దేశాల కరెన్సీని సేకరించాను. ఇప్పటి వరకు ఎక్కడా ప్రదర్శన ఏర్పాటు చేయలేదు. మరిన్ని పురాతన నాణేలు...నోట్లు సేకరించి త్వరలోనే ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేయాలని ఉంది. భావి తరాలకు మన సంస్కృతి తెలిజెప్పేందుకు నాణేలు కూడా తోడ్పడతాయన్నది నా నమ్మకం.
- రహంతుల్లా, హిందూపురం

Advertisement
Advertisement