రండి... రైల్వేను అందంగా అలంకరిద్దాం | Sakshi
Sakshi News home page

రండి... రైల్వేను అందంగా అలంకరిద్దాం

Published Sat, Jul 30 2016 6:02 PM

రండి... రైల్వేను అందంగా అలంకరిద్దాం - Sakshi

తాటిచెట్లపాలెం : జౌత్సాహికులైన కళాకారులు స్వచ్ఛందంగా రైల్వే స్టేషన్‌లో వాల్‌పెయింట్స్‌ వేయడానికి స్వాగతం పలుకుతోంది. విశాఖ రైల్వేస్టేçÙన్‌ ను ఆకర్షణీయంగా రూపొందించడానికి  తమ వంతు సహకారం అందించమంటోంది. వేలాది మంది ప్రయాణికులు సంచరించే విశాఖ రైల్వేస్టేçÙన్‌లో తమకు తోచిన రీతిలో అందమైన పెయింటింగ్స్‌ వేసి, తమ పేరుని అక్కడే పెయింటింగ్‌ వద్ద లిఖించుకోమంటోంది. ఈకో రైల్వే హెడ్‌క్వార్టర్‌ భువనేశ్వర్‌ తరహాలో వాలే్తరు డివిజన్‌లో పలు స్టేషన్ల సుందరీకరణకు రైల్వేశాఖ నడుం బిగించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే వాలే్తరు డివిజన్‌ ఇంజినీరింగ్‌ విభాగాధికారులు విశాఖ రైల్వేస్టేçÙన్‌ ఎనిమిదో నంబరు ప్లాట్‌ఫాంపై పలు రకాల ఆకతులను, ప్రకతి అందాలను ప్రతిబింబించే విధంగా వాల్‌పెయింటింగ్స్‌ను వేయించారు. ఇప్పటికే గిరిజన సంప్రదాయాలను ప్రతిబింబించే కళాత్మక రూపాలతో గోడలను సుందరీకరించిన వాలే్తరు డివిజన్, విశాఖలో ముఖ్యమైన ప్రదేశాలను ప్రతిబింబించేలా ఒకటి, ఎనిమిదో నంబరు ప్లాట్‌ఫాంల గోడలపై లిఖింపజేసే యోచనలో ఉంది. విశాఖలో పర్యాటకSప్రదేశాలైన కైలాసగిరి, బీచ్‌రోడ్డు ప్రాంతం, సబ్‌మెరీన్, లైట్‌హౌస్, సంప్రదాయనత్యాలు, పల్లెటూరి ఆడపడుచుల రీతులతో పాటు గత వైభవాన్ని చాటే విధంగా ఉండే దశ్యాలతో వాల్‌పెయింటింగ్స్‌ వేయాలని సంకల్పించారు. 
ఇదే రీతిలో భువనేశ్వర్‌ రైల్వేశాఖ స్టేషన్‌ పరిసరాలను చూడదగ్గ ప్రాంతాలతో ఆకర్షణీయంగా రూపొందించాలని భావించగా, అక్కడి పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి రైల్వేశాఖ నుంచి సాయాన్ని అర్థించకుండా చక్కని వాల్‌ పెయింటింగ్స్‌ను రూపొందించి అందజేశారు. 
వారిని రైల్వే జీఎం రాజీవ్‌ బిష్ణోయ్‌ అభినందించారు. కాగా తాము తలపెట్టే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా భాగస్వామ్యులు కావాలని ఆకాంక్షిస్తున్నామని  వాలే్తరు డివిజన్‌ సీనియర్‌ డీసీఎం ఎల్వేందర్‌యాదవ్‌ పేర్కొన్నారు. రైల్వేపరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు ఇప్పటికే ముందుకు వచ్చాయని, ఇదే తరహాలో ఇటు ఒకటో నంబరు ప్లాట్‌ఫాం, ఎనిమిదో నంబరు ప్లాట్‌ఫాంల వద్ద సుందరీకరణకు స్వచ్ఛందంగా వచ్చే స్థానిక వలంటీర్లకు ఆహ్వానం పలుకుతున్నామన్నారు. తమకు నచ్చిన రీతిలో అందమైన పెయింటింగ్స్‌ వేసిన వారికి రైల్వే తరఫున అప్రిసియేషన్‌ సర్టిఫికెట్‌ను అందజేస్తామన్నారు.
 
 

Advertisement
Advertisement