అగ్రిగోల్డ్ ఆస్తుల విక్రయాలపై త్రిసభ్య కమిటీ | Sakshi
Sakshi News home page

అగ్రిగోల్డ్ ఆస్తుల విక్రయాలపై త్రిసభ్య కమిటీ

Published Fri, Oct 16 2015 5:04 PM

comittee appointed on AgriGold issue

అగ్రిగోల్డ్ కంపెనీకి సంబంధించిన ఆస్తుల విక్రయాల పర్యవేక్షణ కోసం హైకోర్టు శుక్రవారం ముగ్గురు సభ్యుల కమిటీని నియమించింది. ఈ కమిటీకి చైర్మన్గా రిటైర్డ్ హైకోర్టు జడ్జి సూర్యారావు, సభ్యులుగా తెలంగాణ ఆర్ధిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు, సీనియర్ చార్టర్ ఎకౌంటెంట్ నర్సింహమూర్తి నియమితులయ్యారు.
 

అగ్రిగోల్డ్ సంస్థలో పెట్టుబడులు పెట్టి సుమారు 40 లక్షల మంది నష్టపోయిన సంగతి తెలిసిందే. వీరిలో 32 లక్షల మంది డిపాజిటర్లు కాగా 8 లక్షల మంది ఏజెంట్లు ఉన్నారు. ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలలో కార్యకలాపాలు నిర్వహించి దివాళా తీసింది. ప్రస్తుతం సంస్థకు చెందిన ఆస్తులను వేలం వేసి బాధితులకు ఊరట కల్పించే నిర్ణయంలో భాగంగా ఈ త్రిసభ్య కమిటీని కోర్టు నియమించింది.

 
 

Advertisement
Advertisement