'రాత్రి 8 తర్వాత క్లాసులు వద్దు' | Sakshi
Sakshi News home page

'రాత్రి 8 తర్వాత క్లాసులు వద్దు'

Published Fri, Jul 31 2015 3:13 PM

'రాత్రి 8 తర్వాత క్లాసులు వద్దు' - Sakshi

గుంటూరు: ర్యాంగింగ్ కారణంగా ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకోవడంతో మేలుకున్న ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం కొత్తగా సమన్వయ కమిటీ ఏర్పాటు చేసింది. ఆర్డీవో భాస్కరనాయుడు అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ కమిటీలో పోలీసు, రెవెన్యూ, యూనివర్సిటీ అధికారులు సభ్యులుగా ఉన్నారు. శుక్రవారం సమావేశమైన ఈ కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

కమిటీ నిర్ణయాలు
* రాత్రి 8 తర్వాత యూనివర్సిటీలో ఎటువంటి క్లాసులు నిర్వహించకూడదు
* క్యాంపస్ లో హైసెక్యురిటీ ఏర్పాటు చేయాలి
* కుల సంఘాలు, రాజకీయ పార్టీల వారికి వర్సిటీలో అడుగుపెట్టనీయరాదు
* వర్సిటీలో పోలీస్ ఔట్ పోస్ట్ నిర్వహించాలి
* ర్యాగింగ్ కమిటీలు ఏర్పాటు చేసి, అందులో విద్యార్థుల తల్లిదండ్రులకు చోటు కల్పించాలి

Advertisement
Advertisement