డిసెంబర్‌ లోపు గృహ నిర్మాణాలు పూర్తిచేయండి | Sakshi
Sakshi News home page

డిసెంబర్‌ లోపు గృహ నిర్మాణాలు పూర్తిచేయండి

Published Tue, Aug 30 2016 9:22 PM

డిసెంబర్‌ లోపు గృహ నిర్మాణాలు పూర్తిచేయండి - Sakshi

మేయర్‌ కోనేరు శ్రీధర్‌ 
విజయవాడ సెంట్రల్‌ : 
అజిత్‌సింగ్‌ నగర్‌ ఎక్సెల్‌ ప్లాంట్‌ వద్ద నిర్మాణం చేస్తున్న జెఎన్‌ఎన్యూఆర్‌ఎం ఇళ్లను డిసెంబర్‌ నెలాఖరునాటికి పూర్తి చేయాలని మేయర్‌ కోనేరు శ్రీధర్‌ హౌసింగ్‌ అధికారుల్ని ఆదేశించారు. మంగళవారం గృహ నిర్మాణాలను పరిశీలించారు. రీ టెండర్లు పిలిచి రెండుప్యాకేజీల కింద 24 బ్లాక్‌ల నిర్మాణం చేపట్టినట్లు అధికారులు వివరించారు. ఎనిమిది బ్లాక్‌లు అక్టోబర్‌ నెలాఖరునాటికి పూర్తవుతాయన్నారు. మేయర్‌ మాట్లాడుతూ డిసెంబర్‌తో జెఎన్‌ఎన్యూఆర్‌ఎం గడువు ముగుస్తోందన్నారు. నిర్ణీతగడువులోపు గృహ నిర్మాణాలను పూర్తి చేయాలని సూచించారు. నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. ఇందులో తేడా వస్తే బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. హౌసింగ్‌ ఈఈ బి.శ్రీనివాసరావు, డీఈ, ఏఈలు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement