వ్యాక్సిన్‌ డ్రాపౌట్స్‌ లేకుండా చూడండి | Sakshi
Sakshi News home page

వ్యాక్సిన్‌ డ్రాపౌట్స్‌ లేకుండా చూడండి

Published Sat, Jul 30 2016 11:18 PM

వ్యాక్సిన్‌ డ్రాపౌట్స్‌ లేకుండా చూడండి

విజయవాడ(లబ్బీపేట) : 
జిల్లాలో ఇమ్యునైజేçషన్‌ కార్యక్రమం వందశాతం జరగాలని, డ్రాపావుట్స్‌ ఎవరూ ఉండరాదని గుంటూరు, రాజమండ్రి జోన్‌ల రీజినల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ డి.షాలినీదేవి అన్నారు. లబ్బీపేటలోని మలేరియా కార్యాలయంలో జిల్లాలోని వైద్యాధికారులు, ఇమ్యునైజేషన్‌ సిబ్బందితో శనివారం వేర్వేరుగా అవగాహన సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ జిల్లాలో పుట్టిన వెంటనే వేసే జీరో వ్యాక్సిన్‌ల నుంచి ప్రతి వ్యాక్సిన్‌లు చిన్నారులకు సకాలంలో వేయాలన్నారు. హైరిస్క్‌ ఏరియాల్లో డ్రాపవుట్స్‌ ఉంటున్నట్లు గతంలో గుర్తించామని, ఆయా ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ముఖ్యంగా సంచార జాతులు, ఇటుక బట్టీలు, నిలవ కూలీలు, క్రషర్స్‌లో ఉండే కుటుంబాలకు చెందిన పిల్లలకు వ్యాక్సిన్‌లు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. చిన్నారి పుట్టినప్పటి నుంచి క్రమం తప్పకుండా వ్యాధి నిరోధక టీకాలు వేసేలా ఆరోగ్య కార్యకర్తలు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యం తగదని ఆమె సూచించారు. అంతేకాకుండా చిన్నారికి వేసిర టీకాలను ఆ«ధార్‌ ఆధారంగా ఆన్‌లైన్‌ చేయాలన్నారు. ప్రస్తుతం విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో వారంలో ఆరు రోజులు వ్యాక్సిన్‌లు అందుబాటులోకి తీసుకు రావడం జరిగిందని, జీరో బేస్‌ వ్యాక్సిన్‌లుఏడురోజులువేస్తారని డాక్టర్‌ షాలినీదేవి చెప్పారు. ఇమ్యునైజేషన్‌ను సమర్థంగా ఎలా నిర్వహించాలో పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యునేజేషన్‌ అధికారి డాక్టర్‌ అమృత, వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ ఆర్‌.నాగమల్లేశ్వరి, జిల్లాలోని వైద్యులు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. 
 

Advertisement
Advertisement