'కేసుల భయంతోనే బాబు నిలదీయటం లేదు' | Sakshi
Sakshi News home page

'కేసుల భయంతోనే బాబు నిలదీయటం లేదు'

Published Mon, Aug 1 2016 12:59 PM

congress fires on chandrababu for failing to get special status

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ, టీడీపీలు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో విద్రోహ సభ నిర్వహించారు. హోదాపై గట్టిగా నిలదీస్తే సీబీఐ కేసులు పెడతారరనే భయం చంద్రబాబుకు ఉందని, కేసులకు భయపడే ఆయన కేంద్రాన్ని నిలదీయటం లేదని కాంగ్రెస్ ఆరోపించింది. తెలుగువారి ఆత్మగౌరవాన్ని చంద్రబాబు ఢిల్లీలో తాకట్టు పెట్టారని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రం నుంచి వైదొలగాలని వారు డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదాపై కుంటిసాకులు చెప్పడాన్ని బీజేపీ మానుకోవాలని కాంగ్రెస్ సూచించింది.
 

Advertisement
Advertisement