కార్పొరేట్‌ స్థాయిలో ప్రభుత్వ వైద్యం | Sakshi
Sakshi News home page

కార్పొరేట్‌ స్థాయిలో ప్రభుత్వ వైద్యం

Published Fri, Sep 9 2016 11:47 PM

ఆస్పత్రిని పరిశీలిస్తున్న జేడీ జయకుమార్‌ బృందం

  • మరణాల నివారణపై వైద్యులకు శిక్షణ
  • ప్రసవ సేవల్లో భద్రాచలం ఆస్పత్రికి రివార్డు
  • మాతా సంక్షేమ విభాగం జేడీ జయకుమార్‌

  • భద్రాచలం : కార్పొరేట్‌ స్థాయిలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోందని వైద్య ఆరోగ్య శాఖ మాతా సంక్షేమ విభాగం రాష్ట్ర జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ జయకుమార్‌ అన్నారు. ఆయన నేతృత్వంలోని ప్రత్యేక నిపుణుల బృందం భద్రాచలం ఏరియా ఆస్పత్రిని శుక్రవారం పరిశీలించింది. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని ప్రసవాల వార్డు, ఎస్‌ఎ¯ŒSసీయూలను పరిశీలించి, చికిత్స పొందుతున్న వారి వివరాలను సేకరించారు. ప్రసవాల వార్డులో ఉన్న బాలింతలను వైద్య సేవలపై అడిగి తెలుసుకున్నారు. సకాలంలో టీకాలు వేస్తున్నారా.. నాణ్యమైన భోజనం పెడుతున్నారా అని స్వయంగా పరిశీలించారు. వైద్యులు, నర్సుల నుంచి ప్రసవ సేవల గురించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం డాక్టర్‌ జయకుమార్‌ మాట్లాడుతూ ఆస్పత్రిలో ప్రసవ సేవలు బాగున్నాయని, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కోటిరెడ్డి నేతత్వంలోని టీమ్‌ బాగా పని చేస్తోందన్నారు. ఇక్కడ అత్యధికంగా ప్రసవాలు జరుగుతుండటం అభినందనీయమన్నారు. ఇప్పటికే మూడుసార్లు అవార్డు పొందినప్పటికీ మరోమారు జాతీయ ఆరోగ్య మిష¯ŒS కింద ప్రోత్సాహకంగా రూ.2వేల నగదు రివార్డుకు ఎంపికైందన్నారు. ప్రతీ వంద ప్రసవాల్లో 40 శాతం మేర ప్రభుత్వాస్పత్రులోనే కచ్చితంగా జరుగాలని, దీనిని సాధించే దిశగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు చెప్పారు. కమ్యూనిటీ, సివిల్‌ ఆస్పత్రులు, 24 గంటలపాటు పనిచేసే మొత్తం 500 ఆస్పత్రులను రాష్ట్రంలో దీనికోసం ఎంపిక చేశామన్నారు. ‘దక్షత’ పథకంలో భాగంగా ఆయా ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యులు, సిబ్బందికి ప్రసవ సేవలపై శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. సుఖ ప్రసవాలు జరిగేలా ఆపరేష¯ŒS థియేటర్లలో మొత్తం 66 రకాల పరికరాలు ఉండాలని, అవసరమైన చోట వీటిని హెచ్‌డీఎస్‌ నిధులతో కొనుగోలు చేసుకునేలా ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. గతేడాది మొదటి త్రైమాసికంలో ప్రస్తుతం 5వేల ప్రసవాలు ఎక్కువగా అయ్యాయన్నారు. వైద్యులు, సిబ్బంది కృషి ఫలితంగానే ఆశించిన ఫలితాలు వస్తున్నాయన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో సంభవిస్తున్న మాతా మరణాలకు అడ్డుకట్ట వేయటమే లక్ష్యంగా ప్రభుత్వం తగిన కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రసవాలు జరిగితే డబ్బులు చెల్లించాలని, కానీ.. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలు ఉచితంగా చేయడంతోపాటు ఇళ్లకు వెళ్లే సమయంలో జననీ సురక్ష పథకం కింద రూ.వెయ్యి అందించనున్నట్లు తెలిపారు. ఆదిలాబాద్‌ వంటి చోట్ల మాతా మరణాలు ఎక్కువగా ఉన్నాయని, తమ పరిశీలన నివేదికను ఉన్నతాధికారుల ద్వారా ప్రభుత్వానికి నివేదించి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. పర్యటనలో ప్రోగ్రాం అధికారులు డాక్టర్‌ జనార్ద¯ŒS, డాక్టర్‌ ప్రవీణ, డీటీటీ పీఓ డాక్టర్‌ ప్రసన్నకుమారి, అదనపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ పుల్లయ్య, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కోటిరెడ్డి, సీనియర్‌ పబ్లిక్‌ హెల్త్‌ అధికారిణి డాక్టర్‌ కోమల, ఆర్‌ఎంఓ డాక్టర్‌ శేషారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
     

Advertisement

తప్పక చదవండి

Advertisement