టీడీపీ అధికార మదంతో విర్రవీగుతోంది | Sakshi
Sakshi News home page

టీడీపీ అధికార మదంతో విర్రవీగుతోంది

Published Sun, Mar 20 2016 2:43 AM

టీడీపీ అధికార మదంతో విర్రవీగుతోంది - Sakshi

సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు మధు, రామకృష్ణ ధ్వజం

 సాక్షి, విజయవాడ బ్యూరో:  అధికారమదంతో టీడీపీ విర్రవీగుతోందని, కోర్టు చెప్పినప్పటికీ ఒక మహిళా ఎమ్మెల్యే అయిన రోజాను శాసనసభకు రానీయకపోవడం అన్యాయం అని సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు మధు, రామకృష్ణ మండిపడ్డారు. ప్రతిపక్షంపై ప్రభుత్వ నిరంకుశ వైఖరి తగదని, గతంలో ఎమర్జెన్సీ విధించిన కాంగ్రెస్‌కు పట్టిన గతే టీడీపీకి పడుతుందని వారు హెచ్చరించారు. విజయవాడలో శనివారం వారిద్దరూ మీడియాతో మాట్లాడుతూ గతంలో పదేళ్లు ప్రజా తిరస్కరణకు గురైన చంద్రబాబు ఇప్పుడు రెండేళ్లు గడవకముందే అన్నివర్గాల విశ్వాసాన్ని కోల్పోయారన్నారు.

ఎన్నికైన ఒక సభ్యురాలిని ఏడాదిపాటు అసెంబ్లీకి రాకుండా చేయడం ప్రభుత్వ నిరంకుశ వైఖరిని తెలియజేస్తోందని మధు అన్నారు. బూటకపు వాగ్దానాలతో గద్దెనెక్కిన బాబు ఒక్క ఎన్నికల హామీని కూడా సవ్యంగా అమలు చేయలేదన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ ఏడాది పాటు రోజాపై సస్పెన్షన్ విధించడమే కాకుండా కోర్టు చెప్పినా వినకుండా.. మార్షల్స్‌తో ఆమెను బయటకు నెట్టించడం ప్రభుత్వ నిరంకుశ వైఖరికి అద్దం పడుతోందన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement