మాతృ సంఘాలతోనే సీపీఎస్‌ రద్దు | Sakshi
Sakshi News home page

మాతృ సంఘాలతోనే సీపీఎస్‌ రద్దు

Published Mon, Feb 13 2017 12:08 AM

cps cancel with mother committes

– నూతన సీపీఎస్‌ సంఘం ఆవిర్భావం
 
తిరుపతి ఎడ్యుకేషన్‌ : ఉద్యోగ, ఉపాధ్యాయుల పాలిట శాపంగా మారిన కాంట్రిబ్యూటరి పెన్షన్‌ స్కీమ్‌(సీపీఎస్‌) రద్దు మాతృ సంఘాల మద్దతుతోనే సాధ్యమని పలువురు పేర్కొన్నారు. తిరుపతిలోని టీపీపీఎం ఉన్నత పాఠశాలలో ఆదివారం చిత్తూరు, వైఎస్సార్‌ కడప, అనంతపురం, ప్రకాశం, తూర్పుగోదావరి, నెల్లూరు, కర్నూలు జిల్లాల వివిధ సంఘాల నాయకులతో నూతన సీపీఎస్‌ సంఘం తాత్కాలిక యాక్షన్‌ కమిటీ ఆవిర్భవించింది. ఇందులో రాయలసీమ నుంచి పీవీఆర్‌.నాయుడు, ప్రభాకర్, రవిశంకర్‌రెడ్డి, దేవానంద్, సమీర్, రమణ, మోహన్, దక్షిణ కోస్తాకు రత్తయ్య, మోజస్, విశ్వనాథ్, కృష్ణారావు, ఉత్తర కోస్తాకు బాలకృష్ణ, పట్టా శ్రీనివాస్, అదనపు బాధ్యులుగా రవికుమార్, లోకేష్, దేవరాజులు, డిల్లీ ప్రకాష్, గురుప్రసాద్, మాధవరెడ్డి, పుల్లారెడ్డి, జానకిరామయ్య, కరుణాకర్, రఘుపతిరెడ్డిలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన పెన్షన్‌ విధానం రద్దుకు అన్ని శాఖల మాతృ సంఘాలను కలుపుకుపోవాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. 
 

Advertisement
Advertisement