వర్షార్పణం | Sakshi
Sakshi News home page

వర్షార్పణం

Published Mon, Oct 3 2016 4:36 PM

బోరేగావ్‌ గ్రామంలో అల్లం పంటలో చేరుకున్న వరదనీరు

ఖరీఫ్‌ కతం.. రైతన్నల ఆందోళన
ఆదుకోవాలని వేడుకోలు

ఝరాసంగం: గత సంవత్సరం వర్షాలు లేక పంటలు ఎండిపోయి రైతులు నష్టపోయారు. ప్రస్తుత సంవత్సరం అధిక వర్షాలు పడి పంటలు నాశనం అయ్యాయి. ఇలా ఈ విధంగా అయితేనేమి రైతులు నష్టపోవడం తప్పడం లేదు. సాగుకు పెట్టిన పెట్టుబడులు చేతికి అందక తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్లుతుంది. దీంతో రైతులు పెట్టుబడి కోసం చేసిన అప్పలు తీర్చలేక అప్పుల పాలవుతున్నారు.

గతంలో ఏన్నాడు లేని విధంగా శుక్రవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి చేతికి వచ్చే పంటలు వాగులో కోట్టుకపోయాయి. మరి కొద్ది ప్రాంతాలలో వాగు పక్కనే ఉన్న పంట పొలాలలోని మట్టి కొట్టుకపోయి ఇసుక దిబ్బలుగా తయారు అయ్యాయి. ఈ పంట పొలాలను చూసిన రైతన్న కన్నీరుమున్నీరు అవుతున్నారు.

రెండు రోజులుగా కురిసన వర్షాలకు పంట పొలాల్లో నీరు చేరుకుని జలమయమయ్యాయి. మండల కేంద్రమైన ఝరాసంగంతో పాటు కక్కరవాడ, బోరేగావ్‌, ప్యాలవరం, బోపన్‌పల్లి, చిలపల్లి, మేదపల్లి, జీర్లపల్లి, జునేగావ్‌ గ్రామాలలో పంటలు అధిక మొతాదులో నాశనం అయ్యాయి. సోయాబీన్‌, చెరుకు, పత్తి, అల్లం, పసుపు తదితర పంటలు వర్షం కారణంగా జలమయమయ్యాయి.

మండలంలో సుమారు 4నుంచి 5వేల ఏకరాలలో పంటలు నీట మునిగినట్లు అధికారులు అంచన వేస్తున్నారు. జీర్లపల్లి, బోరేగావ్‌, బోపన్‌పల్లి గ్రామాలలో సాగుచేసుకున్న చెరుకు పంట రైతులకు చేదును మిగిల్చింది. సాగుచేసుకున్న చెరుకు పంటలో నుండి వాగు పారడంతో వరద ఉదృతికి పూర్తిగా నెలమట్టం అయింది.

వేలాది ఎకరాలలో పంట నష్టం
మండలంలో సుమారు 4నుంచి 5వేల ఎకరాలలో రైతులు సాగుచేసుకున్న వివిధ రకాల పంటలు వర్షంతో నాశనంతో అయ్యాయి.  గ్రామాలలో అధికారులు పర్యటించి పంట నష్టపోయిన రైతుల యొక్క వివరాలు సేకరిస్తున్నారు. పంటలు వారిగా దెబ్బతిన్న పంటల వివరాలు సేకరించి నివేదికలను ప్రభుత్వానికి పంపుతామని అధికారులు తెలిపారు. నష్టపోయిన రైతులు తమను ప్రభుత్వం ఆదుకొని నష్టం పరిహరం చెల్లించి ఆదుకోవాలని ఆయా గ్రామాల రైతులు కోరుతున్నారు.

Advertisement
Advertisement