పేలిన సిలిండర్‌–రెండు ఇళ్లు దగ్ధం | Sakshi
Sakshi News home page

పేలిన సిలిండర్‌–రెండు ఇళ్లు దగ్ధం

Published Fri, Oct 7 2016 1:15 AM

పేలిన సిలిండర్‌–రెండు ఇళ్లు దగ్ధం - Sakshi

 
ఆత్మకూరురూరల్‌ : ప్రమాదవశాత్తు గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో గిరిజనులకు చెందిన రెండు పూరిళ్లు పూర్తిగా అగ్నికి ఆహుతైన సంఘటన మండలంలోని చెర్లోయడవల్లి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు.. గ్రామంలోని గిరిజన కాలనీకి చెందిన పొంతగిరి రాజయ్య, పొంతగిరి పెంచలమ్మలు పూరిగుడిసెల్లో నివసిస్తున్నారు. రాజయ్య భార్య కుమారి గురువారం మధ్యాహ్నం ఇంట్లో వంట చేస్తున్న సమయంలో గ్యాస్‌ పైప్‌ నుంచి మంటలు రావడంతో భయప వెంటనే తన బిడ్డనుì తీసుకుని వెలుపలికి పరుగెత్తింది. కొంతసేపటికి మంటలు అంటుకుని సిలిండర్‌ పెద్ద శబ్దంతో పేలి దూరంగా పడింది. సమీపంలోని పెంచలమ్మ గుడిసెకు సైతం మంటలు అంటుకుని పూర్తిగా దగ్ధమైంది. కట్టుబట్టలు తప్ప మిగిలిన సరుకులు అగ్నికి ఆహుతయ్యాయి. ఆ సమయంలో మనుషులు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న ఎంపీపీ సిద్ధం సుష్మ కుటుంబసభ్యులు బాధిత కుటుంబీకులకు భోజన వసతి కల్పించి 60 కేజీల బియ్యం, కొంత నగదును అందజేశారు. గ్రామసర్పంచ్‌ కేతా విజయభాస్కర్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించారు. తహశీల్దారు సారంగపాణి వీఆర్వోను నివేదిక అందజేయాలని కోరారు.
 
 

Advertisement
Advertisement