విద్యుత్‌ నష్టాలకు చెక్‌! | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ నష్టాలకు చెక్‌!

Published Wed, Mar 15 2017 12:39 AM

Czech power losses

 –  శాంతిరాం ఇంజినీరింగ్‌ విద్యార్థి వినూత్న ప్రయోగం
 -  ఫార్ములా, పరికరం తయారీ
-  పేటెంట్‌ తీసుకున్న బీహెచ్‌ఈఎల్‌
– వాసుదేవ్‌కు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అభినందనలు
– 20న మోదీతో భేటీ
నంద్యాల: విద్యుత్‌చౌరా​‍్యన్ని అరికట్టేందుకు రాత్రిపూట తనిఖీలు..బకాయిలు చెలి​‍్లంచని వారి విద్యుత్‌ కనెక‌్షన్‌ను తొలగించడానికి  కరెంట్‌ స్తంభాలు ఎక్కడం వంటివి  చేయాల్సిన అవసరం లేదు. ఆఫీసులోనే కంప్యూటర్‌ ఎదుట కూర్చోని కనెక‌్షన్‌ను తొలగించవచ్చు. విద్యుత్‌ శాఖలో జరుగుతున్న చౌర్యం వృథాను నివారించి ఆదా  చేయడానికి శాంతిరాం ఇంజినీరింగ్‌ కాలేజీలో చదువుతున్న విద్యార్థి వాసుదేవ్‌ వినూత్న ఫార్ములా కనుగొన్నారు. ఈ ఫార్ములా పేటెంట్‌ హక్కులను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భారత్‌ హెవీ ఎలక్ట్రికల్‌ లిమిటెడ్‌(బీహెచ్‌ఈఎల్‌) సంస్థ స్వీకరించింది. ఈ విద్యార్థి ఫార్ములాను గతనెలలో ప్రత్యక్షంగా చూసిన రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అమల్లోకి తీసుకొని రావాలని కేంద్రానికి సూచించారు.
 
ఈనేపథ్యంలో ఈనెల 20వ తేదీన వాసుదేవ్‌ ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్రమోదీ నిర్వహించే మన్‌కీ బాత్‌ కార్యక్రమంలో ఆయనతో భేటీ కానున్నారు. విద్యుత్‌ శాఖకు రూ.కోట్లలో ఆదా చేసే ఫార్ములాను కనిపెట్టిన ఆ విద్యార్థికి భారీ బందోబస్తు  కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఇప్పటికే అతని నివాసాన్ని మార్చి, పూర్తిస్థాయి భద్రత ఉన్న ప్రాంతంలో ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఆ విద్యార్థి ప్రధాని మోదీని కలిశాక ప్రభుత్వం ఈ ఫార్ములా గురించి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.  
స్థానిక విశ్వనగరకు చెందిన సామాన్య వడ్రంగి ఆచారి కుమారుడు శాంతిరాం ఇంజినీరింగ్‌ కాలేజీలో ఎలక్ట్రికల్‌ విభాగంలో మూడో సంవత్సరం చదువుతున్నారు.
 
విద్యుత్‌ శాఖలో చౌర్యం, లైన్‌లాస్‌తో రూ.కోట్లలో నష్టం ఏర్పడుతుంది.  అధికారులు ఇ ప్పటి వరకు ఆ నష్టాన్ని నివారించలేకపోయారు. దీనిపై వాసుదేవ్‌ పరిశోధించి ఫార్ములా, పరికరాన్ని రూపొందించారు. తీగలపై విద్యుత్‌ చౌర్యం చేయడానికి కుదరదు. వినియోగదారుడు బిల్లు చెల్లించకపోతే, టెలిఫోన్‌ కనెక‌్షన్లను తొలగించినట్లు ఆఫీసులో నుంచి నేరుగా   కనెక‌్షన్‌ను తొలగించవచ్చు. బిల్లు  చెల్లించాక నేరుగా  విద్యుత్‌  సరఫరాను పునరుద్ధరించవచ్చు. ఈ ఫార్ములాను ఆర్‌జీఎం విద్యాసంస్థల అధినేత డాక్టర్‌  శాంతిరాముడు, మేనేజింగ్‌ డైరెక్టర్‌ శివరాం పరిశీలించి భారత ప్రభుత్వరంగ సంస్థ బీహెచ్‌ఈఎల్‌కు పంపారు. ఇది ఎంతవరకు సాధ్యమనే దానిపై  పరిశోధన చేసిన బీహెచ్‌ఈఎల్‌  కాలేజీ యాజమాన్యాన్ని, వాసుదేవ్‌ను సంప్రదించి పేటెంట్‌ హక్కులను పొందింది. 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement