నాన్నా.. నే బతుకుతానా... | Sakshi
Sakshi News home page

నాన్నా.. నే బతుకుతానా...

Published Mon, Aug 1 2016 10:57 AM

హైదరాబాబ్‌ రెయిన్‌బో ఆస్పత్రిలో క్యాన్సర్‌ చికిత్స పొందుతున్న శైలజ

కేన్సర్‌తో బాధపడుతున్న ఆరేళ్ల చిన్నారి 
ఆపన్నహస్తం కోసం తల్లిదండ్రుల ఎదురుచూపు 
చికిత్సకు రూ.8లక్షలు అవసరం 
మల్దకల్‌ మండలంలోని బిజ్వారం పరిధిలోని దాసరిపల్లికి చెందిన బోయ గోవిందమ్మ, బోయ సర్వేష్‌కు శైలజ(6) సతీష్‌(4) సంతానం. గ్రామంలో కూలి పనులు చేస్తూ తమ పిల్లలను చదివిస్తున్నారు. శైలజకు చదువుపై ఉన్న ఆసక్తిని గమనించి గ్రామంలోని రఘునందని ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలలో చేర్పించారు. ఇటీవల అనారోగ్యానికి గురవడంతో గద్వాలలోని ఆస్పత్రిలో చూపించారు. తగ్గిన కొన్ని రోజులకే మళ్లీ అస్వస్థతకు గురయ్యింది. దీంతో కర్నూలులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా హైదరాబాద్‌ తీసుకెళ్లాలని సూచించారు. అక్కడి పరీక్షించిన వైద్యులు కేన్సర్‌ అని నిర్ధారించారు. నయం చేయడానికి రూ.8లక్షలు అవసరమవుతాయని చెప్పారని తల్లిదండ్రులు తెలిపారు. నెల రోజులుగా హైదరాబాద్‌లోని రెయిన్‌బో ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు.

ఇప్పటికే దాదాపు రూ.2లక్షల వరకు అప్పుచేసి చికిత్స చేయించామని, ఏమాత్రం ఆస్తులులేని మాకు ఇప్పుడు డబ్బు పుట్టడంలేదని, వైద్యం చేయించలేకపోతున్నామని అంటున్నారు. పాపను బతికించేందుకు కీమోథెరపి చికిత్స చేయించాలని, రెక్కాడితేగాని డొక్కాడని తమ పరిస్థితిని గమనించి దయార్ధహృదయులు స్పందించి ఆదుకోవాలని చేతులుజోడించి వేడుకుంటున్నారు. ఆపన్నహస్తం అందించాలనుకునే వారు తనగల సర్వేష్‌ సెల్‌ నంబర్‌ 9640965543లో సంప్రదించవచ్చు. కార్పొరేషన్‌ బ్యాంకు అకౌంట్‌ నంబర్‌– 171900101000576 (ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ నంబర్‌ : (సీఓఆర్‌ (పెద్ద అక్షరాలు)– 0001719), కృష్ణరివర్‌ రోడ్డు, గద్వాలకు అందించవచ్చు.

Advertisement
Advertisement