దూరవిద్య పరీక్షలు నిర్వహించాలి | Sakshi
Sakshi News home page

దూరవిద్య పరీక్షలు నిర్వహించాలి

Published Thu, Jul 21 2016 10:10 PM

ఆందోళన చేస్తున్న కోఆర్డినేటర్లు

యూనివర్సిటీక్యాంపస్‌:  ఎస్వీ యూనివర్సిటీలో 2014–15 సంవత్సరానికి సంబంధించి పీజీ, యూజీ పరీక్షలను వెంటనే నిర్వహించాలని కోరుతూ అధ్యయన కేంద్రాల సమన్వయ కర్తలు(కో–ఆర్డినేటర్లు) గురువారం ఆందోళన చేశారు. పరిపాలనా భవనం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్వీయూ దూర  విద్యా విభాగం పరిధిలో 147 అధ్యయన కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. వీటి ద్వారా 61వేల మంది అడ్మిషన్‌ పొందారని చెప్పారు. గత ఏడాది సెప్టెంబర్‌లో జరగాల్సిన పరీక్షలను ఇప్పటి వరకు నిర్వహించలేదని పేర్కొన్నారు. రాష్ట్రంలోని మిగతా విశ్వవిద్యాలయాల్లో పరీక్షలు నిర్వహించి ఫలితాలు విడుదల చేసినా, ఇక్కడ మాత్రం పరీక్షలు నిర్వహించలేదని తెలిపారు. 2014 సెప్టెంబర్‌లో అడ్మిషన్‌ పొందినవారికి ఈ ఏడాది జూన్‌లో మెటిరియల్‌ ఇచ్చారని చెప్పారు. సరైన సమయంలో పరీక్షలు నిర్వహించకపోవడం వల్ల చాలా మంది పోటీ పరీక్షలు, ఉద్యోగావకాశాలు కోల్పోయారని తెలిపారు. 2014–15 విద్యాసంవత్సరంలో వీసీ హామీ మేరకు 20వేల అడ్మిషన్లు చేశామని చెప్పారు.  తమ స్టడీ సెంటర్లకు అనుబంధంగా ఉన్న డిగ్రీ కళాశాలల్లోనే కాకుండా వేరే కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించడం బాధాకరమన్నారు. దీనివల్ల 50వేల మంది విద్యార్థులకు నష్టం వాటిల్లిందని చెప్పారు.  ఆందోళనలో పాల్గొన్నవారిలో పి.చంద్రశేఖరయ్య, తిమ్మారెడ్డి, శ్రీనివాసులు, జగన్, రవికుమార్‌ తదితరులు వున్నారు.
 
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement