బకింగ్‌హామ్‌ కెనాల్‌లో మృతదేహం | Sakshi
Sakshi News home page

బకింగ్‌హామ్‌ కెనాల్‌లో మృతదేహం

Published Sun, Dec 4 2016 8:56 PM

Dead body in Buckingham canal

అమరారెడ్డి కాలనీ (తాడేపల్లి రూరల్‌) : పట్టణ పరిధిలోని అమరారెడ్డి కాలనీ వద్ద బకింగ్‌హామ్‌ కెనాల్‌లో కుళ్లినపోయిన స్థితిలో ఉన్న ఓ మృతదేహాన్ని స్థానికులు ఆదివారం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బకింగ్‌హామ్‌ కెనాల్‌లో కుళ్లిపోయిన స్థితిలో ఉండి దుర్వాసన వెదజల్లుతున్న మృతదేహం గత నెల 21వ తేదీన సీతానగరం బకింగ్‌హామ్‌ కాలువ హెడ్‌స్లూయిజ్‌ వద్ద ప్రమాద వశాత్తూ నీటిలోకి జారి కొట్టుకుపోయిన మూడు మృతదేహాలలో ఒకటైన షఫిదిగా పోలీసులు గుర్తించి బంధువులకు సమాచారం ఇచ్చారు. మిగిలిన ఇద్దరి మృతదేహాలు బకింగ్‌హామ్‌ కెనాల్‌ నుంచి 22వ తేదీనే వెలికితీసిన పోలీసులు, షఫి మృతదేహం కోసం దాదాపు వారం రోజుల పాటు గాలించినా పోలీసులకు ఎటువంటి ప్రయోజనం లభించలేదు. షఫి మృతదేహం లభ్యం కావడంతో తాడేపల్లి పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement