Sakshi News home page

ప్రత్యేక హోదా కోసం.. ఆమరణ దీక్ష!

Published Wed, Sep 14 2016 11:26 PM

deeksha for special status

– తేదీ ప్రకటనపై నేడు అఖిలపక్ష నేతలు, జర్నలిస్టుల సమావేశం
– ఏపీయూడబ్ల్యూజే చర్చావేదికలో తీర్మానం


(సాక్షి ప్రతినిధి, అనంతపురం)
ప్రత్యేకSహోదా సాధన కోసం ఉద్యమాన్ని ఉధతం చేసేందుకు జిల్లా నేతలు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే ఆమరణ  నిరాహారదీక్ష చేపట్టనున్నారు. ‘ప్రత్యేకSహోదా సాధన– మన బాధ్యత’ అనే అంశంపై ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ‘అనంత’ జర్నలిస్టులు బుధవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో చర్చావేదిక నిర్వహించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకష్ణ, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోటా సత్యం, సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు జగదీశ్, రాంభూపాల్‌తో పాలు పలువురు జర్నలిస్టులు, ప్రజా, కుల సంఘాల నేతలు హాజరయ్యారు. ప్రత్యేకSహోదా ఐదేళ్లు కాదు.. పదేళ్లు ఇవ్వాలని రాజ్యసభలో రగడ చేసిన వెంకయ్యనాయుడు ఈరోజు మాట మార్చడం దారుణమని వక్తలు అన్నారు. 15ఏళ్లు కావాలన్న సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు పూర్తిగా చేతులెత్తేసి ప్రత్యేక ప్యాకేజీనే పరమాన్నం అన్నట్లు వ్యవహరిస్తూ రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. 


వెనుకబడిన ప్రాంతాలకు జిల్లాకు రూ.50కోట్ల చొప్పున ఇచ్చిన నిధులను ఖర్చు చేయడంలో∙రాష్ట్ర ప్రభుత్వం నిర్లిప్తంగా వ్యవహరిస్తోందన్నారు. అలాంటిది మళ్లీ కేంద్రాన్ని నిధులు అడిగితే.. ఇప్పటి వరకూ ఇచ్చినవి ఖర్చుచేశారా అంటే సీఎం ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.  రాష్ట్రానికి కాస్తయినా మేలు జరగాలంటే హోదా తప్ప మరో మార్గం లేదన్నారు. ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ప్రత్యేకహోదాపై వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తూనే ఉన్నామన్నారు. అసెంబ్లీలో కూడా ఈ అంశం తీవ్రత తెలియాలని ఎమ్మెల్యేలం గట్టిగా పట్టుబట్టామని గుర్తు చేశారు. ప్రత్యేకహోదా ఉద్యమంలో  వామపక్షాలను కలుపుకుని ముందుకెళతామన్నారు.

మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి మాట్లాడుతూ  ‘హోదాభిక్ష కాదు...అది మన హక్కు’ అనే నినాదంతో ఉద్యమాన్ని ఉధతం చేస్తామన్నారు. రాజకీయపార్టీలు, జర్నలిస్టులతో సుదీర్ఘ ఉద్యమాన్ని నిర్మించేలా కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు మచ్చా రామలింగారెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోటా సత్యం ఆమరణదీక్షకు సిద్ధమని ప్రకటించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్‌ మాట్లాడుతూ ప్రత్యేకహోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దొంగాట ఆడుతున్నాయన్నారు. వాటి మధ్య స్వార్థపూరితమైన మైత్రి మినహా ప్రజలకు ఉపయోగపడేలా లేదన్నారు. ఉద్యమాన్ని తీవ్రస్థాయిలో చేపడతామన్నారు.

ఆమరదీక్షపై నేడు తేదీ ప్రకటన
ఆమరణదీక్ష తేదీని ప్రకటించేందుకు అఖిలప„ý , ఏపీయూడబ్ల్యూజే నేతలు నేడు (గురువారం)  మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి ఆధ్వర్యంలో  సమావేశం కానున్నారు. ఎప్పుడు దీక్ష చేయాలి, ఎవరు దీక్షలో కూర్చోవాలనే వివరాలను ప్రకటించనున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement