వర్షం వచ్చినా ఆటంకం కలుగకుండా ఏర్పాట్లు | Sakshi
Sakshi News home page

వర్షం వచ్చినా ఆటంకం కలుగకుండా ఏర్పాట్లు

Published Fri, Sep 16 2016 12:54 AM

వర్షం వచ్చినా ఆటంకం కలుగకుండా ఏర్పాట్లు

  • రేపు జేఎన్‌ఎస్‌లో తిరంగా యాత్ర ముగింపు సభ
  • నాటి పోరాట యో«ధులను సన్మానించనున్న అమిత్‌షా
  • బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌ రాజేశ్వర్‌రావు
  • హన్మకొండ : వర్షం వచ్చినప్పటికీ శనివారం హన్మకొండ జేఎన్‌ఎస్‌లో జరగనున్న తిరంగా యాత్ర ముగింపు సభ కు ఆటంకం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు బీజే పీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌ డాక్టర్‌ టి.రాజేశ్వర్‌రావు తెలిపారు.  హన్మకొండలోని వేద బాంక్వెట్‌హాల్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శనివారం సాయంత్రం 4 గంటలకు హన్మకొండలోని జవహార్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో జరుగనున్న తిరంగాయాత్ర ముగింపు సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పాల్గొనున్నారన్నారు. ఈ సభకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వర్షం కురిసిన ప్రజలు తడువకుండా ఉండేందుకు పాలిథీ¯ŒS కవర్లతో పై కప్పు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ సభలో నాటి పో రాట యోధులను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సన్మానించనున్నరన్నారు. అదే విదంగా నిజాం కాలంలో నిజాం సేనలు, రజాకార్ల మూకలు చేసిన అకృత్యాలు వివరించేలా దృశ్యకావ్యాన్ని ప్రదర్శించనున్నట్లు తెలి పారు. నిజాం పాలనలో వరంగల్‌కు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా ఇక్కడ తిరంగా యాత్ర ముగింపు సభ ఏర్పాటుచేసిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాను ఆహ్వానిం చినట్లు రాజేశ్వర్‌రావు వివరించారు. కాగా,  తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, అకాంక్షలు నెరవేర్చేందుకు, చిరకాల స్వప్నం అయిన సెప్టెంబర్‌ 17న తెలంగాణ స్వాతంత్య్ర దినంగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఆయన డిమాండ్‌ చేశారు. తెలంగాణ స్వాతంత్య్ర దినా న్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, కుటుంబ స భ్యులు, టీఆర్‌ఎస్‌ పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. జూన్‌ 2న తెలంగాణ వచ్చిందని, ఇక సెప్టెంబర్‌ 17న జరుపుకోవాల్సిన అవసరం లేదని, తమ ఉద్యమ చరిత్ర మరుగున పడుతుందని సీఎం కేసీఆర్, కూతురు కవిత అనడం సరికాదని ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటికైనా సెప్టెంబర్‌ 17ను అధికారికంగా నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ఈనెల 17వ తేదీన బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినాన్ని గ్రామగ్రామాన, వాడ వాడలా జరుపుకుంటామని, జాతీయ పతాకాలను ఎగురవేస్తామన్నారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కా ర్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు మార్తినేని ధర్మారావు, కార్యదర్శి రావు పద్మ, నాయకులు చింతాకు ల సునీల్, వన్నాల శ్రీరాములు, సురేష్‌ పాల్గొన్నారు. 

Advertisement
Advertisement