సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి | Sakshi
Sakshi News home page

సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి

Published Wed, Nov 2 2016 2:06 AM

సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి

సైలాడ (ఆమదాలవలస రూరల్) :  సాంకేతిక పరిజ్ఞానంతోనే అభివృద్ధి సాధ్యపడుతుందని సైలాడ సర్పంచ్ జోగి చంద్రశేఖర్ అన్నారు. దీన్ని యువత గుర్తించి సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టి సారించి గ్రామాల అభివృద్ధికి పాటు పడాలని సూచించారు. సైలాడ, కుమ్మరిపేట, దివంజిపేట గ్రామాల్లో పర్లాకిఖముండిలోని సెంచూరియన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో గ్రామస్తులకు డిజిటల్ లిటరసి పోగ్రాంపై మంగళవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రజలకు ట్యాబ్, స్మార్ట్ ఫోన్ వినియోగంపై అవగాహన కల్పించారు. గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యులకు, చదువుకున్న యువతకు, రైతులు, మహిళలకు అన్ని రంగాల్లో శిక్షణ ఇచ్చేందుకు యూనివర్సిటీ అవగాహన కల్పిస్తుందని వీటిని గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రస్తుత కాలంలో ఇంటర్నెట్ వినియోగం బాగా పెరుగుతుందని వాటిపై అవగాహన ఉంటే ఇంట్లోనే అన్ని విధాలుగా పథకాల వివరాలు తెలుసుకునేందుకు వీలు పడుతుందని తెలిపారు.
 

Advertisement
Advertisement