స్వప్రయోజనాలకు హోదా తాకట్టు | Sakshi
Sakshi News home page

స్వప్రయోజనాలకు హోదా తాకట్టు

Published Thu, Sep 8 2016 10:53 PM

స్వప్రయోజనాలకు హోదా తాకట్టు - Sakshi

– వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పోస్టల్‌ కార్యాలయం ఎదుట ధర్నా
 
కర్నూలు సిటీ: సీఎం చంద్రబాబు నాయుడు స్వప్రయోజనాల కోసం ప్రత్యేక హోదాను ఢిల్లీలో తాకట్టుపెట్టారని వామ పక్ష పార్టీలు, విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. గురువారం స్థానిక పోస్టల్‌ కార్యాలయం ఎదుట వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు టి.షడ్రక్, సీపీఐ నగర కార్యదర్శి రసూల్, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రంగన్న శ్రీనివాసులు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి జగన్నాథం, ఏఐటీయుసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనోహర్‌ మాణిక్యం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనరసింహ మాట్లాడారు. విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా కావాని అడిగిన నేతలే ఈ రోజు హోదా ఇవ్వలేమని ప్రకటించడం దారుణమన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు.. తన అసమర్థ నాయకత్వంతో రాష్ట్ర ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా శనివారం తలపెట్టిన బంద్‌కు అందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం నగర కార్యదర్శి గౌస్‌దేశాయ్, సీఐటీయు నాయకులు రాధాకష్ణ, అంజిబాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కె.వి నారాయణ, రైతు సంఘం నాయకులు నాగేశ్వరరావు, ఐద్వా, ఇతర ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు  ాల్గొన్నారు.
 

Advertisement
Advertisement