స్వైన్‌ఫ్లూ అలజడి | Sakshi
Sakshi News home page

స్వైన్‌ఫ్లూ అలజడి

Published Wed, Feb 1 2017 1:02 AM

స్వైన్‌ఫ్లూ అలజడి

తాజాగా ఇద్దరికి వ్యాధి నిర్ధారణ
8మందికి రోగ లక్షణాలు
వైద్యులు, సిబ్బందిని ఆందోళనకు గురిచేస్తున్న వ్యాక్సిన్ల కొరత


తిరుపతి మెడికల్‌ :  జిల్లాలో స్వైన్‌ఫ్లూ బాధితుల సంఖ్య పెరగడం కలవరపెడుతోంది. మంగళవారం 10 మంది స్వైన్‌ఫ్లూ వ్యాధి లక్షణాలతో స్విమ్స్‌కు చేరుకున్నారు. వారిలో ఇద్దరికి స్వైన్‌ఫ్లూ వ్యాధి ఉన్నట్టు నిర్థారించారు. మిగిలిన వారు ౖవైద్య సేవలు పొందుతున్నారు. వీరిలో కడపకు చెందిన వారు ఇద్దరు, విశాఖకు చెందిన వారు ఒకరు కాగా మిగిలిన వారు జిల్లాకు చెందినవారు. సోమవారం అర్ధరాత్రి ఒకరు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా స్వైన్‌ఫ్లూ రోగుల కోసం రుయాలో ప్రత్యేక
Üదుపాయాలతో గదులను ఏర్పాటుచేశారు. వెంటిలేటర్లను సమకూరుస్తున్నారు. వీరికి సేవలందించే వైద్యులు, సిబ్బందికి యాంటీ స్వైన్‌ఫ్లూ వ్యాక్సిన్లను వాడాల్సి ఉంది.

ఈ వ్యాక్సిన్లును ప్రభుత్వం సరఫరా చేయకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. తాజాగా ఓ హౌస్‌ సర్జన్‌కు వ్యాధి లక్షణాలు రావడం, శాంపిల్స్‌కు పంపిన నేపథ్యంలో ఎక్కడ తమకు వ్యాధి సోకుతుందోనని బెంబేలెత్తిపోతున్నారు. మంగళవారం తిరుపతి రుయా ఆసుపత్రికి వచ్చిన జిల్లా కలెక్టర్‌ సిద్దార్థ్‌ జైన్‌ వచ్చారు. ఈ సందర్భంగా రుయాలో వ్యాక్సిన్ల  కొరత ఉందని, వైద్యం చేయాలంటే ఎక్కడ వ్యాధి సోకుతుందేమోనని వైద్యులు, వైద్య సిబ్బంది ఆందోళన చెందుతున్నారని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. స్వైన్‌ఫ్లూ వ్యాధి ప్రాణాలు తీసేంత ప్రమాదం కాదని, వ్యాధి లక్షణాలు వచ్చిన వెంటనే వైద్యుల వద్దకు వస్తే వ్యాధికి తగ్గేలా మందులు ఇస్తే తగ్గిపోతుందని కలెక్టరు వ్యాఖ్యానించడంతో వైద్యులు విస్తుపోయారు.   

 

Advertisement

తప్పక చదవండి

Advertisement