‘జిల్లాల విభజన సహేతుకంగా లేదు’ | Sakshi
Sakshi News home page

‘జిల్లాల విభజన సహేతుకంగా లేదు’

Published Thu, Sep 15 2016 12:01 AM

‘జిల్లాల విభజన సహేతుకంగా లేదు’

చిలుకూరు: జిల్లాల విభజనను స్వాగతిస్తున్నాం. కానీ మండలాలు, డివిజన్‌ల విభజన సహేతుకంగా లేదని ఎస్టీయూ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు యతిపతిరావును అన్నారు. మంగళవారం చిలుకూరు ఎమ్మార్సీ కార్యాలయంలో జరిగిన అ సంఘం మండల సమావేశంలో మాట్లాడారు.  జోనల్‌ వ్యవస్థను కొనసాగించాలి డిమాండ్‌ చేశారు. సీపీఎస్‌ విధానాన్ని తమిళనాడు రాష్ట్రంలో మాదిరిగా అమలు చేయాలన్నారు. పీఆర్సీ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. 2016 డీఎస్సీ తక్షణమే నిర్వహించి ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వీరరాఘవులు, మండల  అధ్యక్షుడు కొండా వెంకయ్య, ప్రధాన కార్యదర్శి కంచుగంటి వెంకటేశ్వర్లు, జిల్లా, మండల నాయకులు గుండు ఆదినారాయణ, మండవ ఉపేందర్, మంద పుల్లయ్య, ఎస్‌. రాదాకృష్ణ,  సురేష్,  పి. నాగేశ్వరారవు, కీరీటం, ఎస్‌. శ్రీనివాస్‌రావు, సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  
 

Advertisement

తప్పక చదవండి

Advertisement